ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మటన్, చికెన్​ దగ్గర మీరే ఉండాలి - ఎంపీడీవో రిటైర్మెంట్​ కార్యక్రమంలో ఉద్యోగులకు బాధ్యతలు - MPDO RETIREMENT IS CONTROVERSIAL

వివాదాస్పదంగా ఎంపీడీవో పదవీ విరమణ కార్యక్రమం - విందు దగ్గర ప్రభుత్వ ఉద్యోగులను కేటాయిస్తూ లేఖ.

MPDO Retirement Program has Controversial
MPDO Retirement Program has Controversial (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2024, 9:41 PM IST

MPDO Retirement Program has Controversial:ఎంపీడీవో పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ విందు కార్యక్రమం వివాదాస్పదమైంది. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలోని చిట్వేలి ఎంపీడీవో శివరామిరెడ్డి పదవి విరమణ సందర్భంగా విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ నెల 28న ఎంపీడీవో పదవీ విరమణ చేయగా ఆయన్ని సన్మానించేందుకు ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో కార్యాలయం సిబ్బందితో పాటు ఉపాధి హామీ పథకం సిబ్బంది గ్రామ సచివాలయాల సిబ్బంది, కార్యదర్శులు హాజరు కావాలని స్వయానా ఎంపీడీవో కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

వివాదాస్పదంగా ఎంపీడీవో పదవీ విరమణ - భోజనాల దగ్గర ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపు (ETV Bharat)

ఈ క్రమంలో విందు భోజనానికి కమిటీ కూడా ఏర్పాటు చేసి విజయవంతం చేయాలనీ పేర్లతో సహా పొందుపరచడం వివాదాస్పదమైంది. విందు సందర్భంగా వడ్డించే మటన్, చికెన్, వైట్ రైస్, కలర్ రైస్, బోటి ఇలా 11 రకాల ఆహార పదార్థాలను వడ్డించే క్రమంలో 22 మంది సిబ్బందికి వాటిని పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. మటన్ దగ్గర ఎవరు ఉండాలి, చికెన్ దగ్గర ఎవరు ఉండాలి, వైట్ రైస్ దగ్గర ఎవరు ఉండాలి అని కమిటీని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అధికారి సీలు, సంతకం చేసి ప్రకటన విడుదల చేయడం పైన తీవ్ర దుమారం రేగింది. ఏవో విడుదల చేసిన కమిటీ లేఖ బయటకు రావడంతో విషయం బయటకు వచ్చింది. ఈ విందు కార్యక్రమానికి దాదాపు 3 లక్షలు ఖర్చు అవుతుండగా ఎవరు భరిస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు - గోదావరి పుష్కరాలు ఎప్పుడంటే

'జరగకూడనివన్నీ జరిగిపోతున్నాయి' - వైఎస్సార్​ అభిమానులకు విజయమ్మ బహిరంగలేఖ

ABOUT THE AUTHOR

...view details