Childrens Amazing Talent in Nellore District : నేటి కాలంలో చాలా మంది పిల్లలు సెల్ఫోన్లో ఆటలు ఆడుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. అన్నం తినలన్నా, బయటికి రావాలన్నా, కనీసం హోం వర్క్ చేయడానికి బద్దకిస్తుంటారు. అలాంటిది నెల్లూరుకు చెందిన ఆ బుడతలు తమ మేధా శక్తి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. వారి ఆలోచనలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరింతగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు.
అప్పుడే బడి బాట పట్టిన అన్నదమ్ములిద్దరూ అద్భుత ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. లెక్కలూ, కూడికలు, తీసివేత్తలో ఒకరు ఆరితేరుతుంటే మరొక బాలుడు తన శక్తికి మించిని ఆలోచనతో అబ్బురపరుస్తున్నారు. పర్యవరణం, జంతు పరిరక్షణపై ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు వైష్ణవ్, విశ్వక్ అనే అన్నదమ్ములిద్దరూ. తల్లిదండ్రులు వీరిద్దరి సృజనాత్మకతను గుర్తించి వారి ప్రతిభను మరింత ప్రోత్సహిస్తున్నారు. పిల్లల జ్ఞాపకశక్తి పట్ల తల్లిదండ్రులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వేసవి శిక్షణ శిబిరాల్లో విజ్ఞానం, వినోదం - చిన్నారుల్లో నూతనోత్సాహం - Summer Camps For Children
Kovuru, Nellore District : నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన రాజేష్ కుమార్ , సుజితల దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. వీరు చిన్నతనంలోనే ఒకరిని మించి మరొకరు ఒక్కొ విషయాల పట్ల అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పెద్దవాడు విశ్వక్ , తను తన శక్తికి మించిన ఆలోచనతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. అడవులను రక్షించాలి, జంతువులను చంపరాదు. మాంసం తినరాదంటూ చిన్న వయస్సులోనే హితబోద చేస్తూ అందరి మనస్సును కదిలించేస్తున్నాడు. ఇక చిన్నఅబ్బాయి వైష్ణవ్ వయస్సులో చిన్నవాడైనా లెక్కలు, కూడికలు, తీసివేతలలో చేయటంలో తనకు తానే సాటి. నీళ్లు తాగినంత సులభంగా అడినవాటికి సమాధానం చెప్పేస్తాడు. అంతే కాదు గణితం పోటీల్లో తను లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ లో స్థానం సంపాదించుకున్నాడు వైష్ణవ్. పెద్దవాళ్లు సైతం చెప్పలేని లెక్కలకు అట్టే సమాధానం చెబుతూ అబ్బురపరుస్తున్నాడు.
వేసవి శిబిరాల్లో సందడి - సెలవులను సద్వినియోగం చేసుకుంటున్న చిన్నారులు - Children Summer Camp In Kurnool
కుమారుల ఇద్దరిలోని ప్రతిభను చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. వారు ఉన్నతంగా ఎదిగేందుకు మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలో ఉండే సృజనాత్మకతను గుర్తించి చిన్ననాటి నుంచే వారిని ప్రోత్సహించాలని సూచించారు.
అనాథలకు ఆపన్న హస్తం- మానవత చాటుతున్న ఫౌండేషన్స్ - Shelter For Orphan Children