ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు- ఘన స్వాగతం పలికిన అధికారులు - Chandrababu maharashtra tour - CHANDRABABU MAHARASHTRA TOUR

Chandrababu Visited Sri Mahalakshmi and Shirdi Saibaba Temples in Maharashtra : టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలోని వివిద ఆలయాలను దర్శించుకున్నారు. కొల్హాపూర్​లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని, శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రబాబు దంపతులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

Chandrababu Visited Sri Mahalakshmi and Shirdi Saibaba Temples in Maharashtra
Chandrababu Visited Sri Mahalakshmi and Shirdi Saibaba Temples in Maharashtra (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 6:58 PM IST

Updated : May 16, 2024, 9:54 PM IST

Chandrababu Visited Sri Mahalakshmi and Shirdi Saibaba Temples in Maharashtra :టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలోని శ్రీ మహాలక్ష్మి(అంబాబాయి), షిరిడి సాయిబాబా ఆలయాలను సందర్శించారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు ఈరోజు ఉదయం 11:30 హైదరాబాద్ నుంచి విమానంలో మహరాష్ట్రలోని కొల్హాపూర్​కు చేరుకున్నారు. మెుదటగా కొల్హాపూర్​లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయాన్నే స్థానికంగా అంబాబాయిగా పిలుస్తారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇస్కాన్ ఆలయాన్ని దర్శించుకున్న చంద్రబాబు.. కృష్ణాష్టమి పూజలు

అంబాబాయి దర్శనం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, కొల్హాపూర్​లోని అంబాబాయి ఆలయం దేశంలో ఉన్న 108 శక్తిపీఠాలలో ఒకటి తెలిపారు. భారతదేశంలోని వివిధ రకలైన పవిత్రమైన ప్రార్థన స్థాలాలలో ఈ ఆలయాని ఎంతో ప్రత్యేకత ఉందని వెల్లడించారు. అందుకే తాను అంబాబాయి ఆలయాన్ని సందర్శించానని తెలిపారు. ప్రజలకు సేవచేసే అవకాశం ఇవ్వాలని అంబాబాయి మాతను కోరినట్లు తెలిపారు. తల్లి మనందరిని ఆశీర్వదిస్తుందని చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే దేశ ప్రజలు మరోసారి ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్నే ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400 లోక్‌సభ స్థానాలను ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంటుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Nara Family Special Poojas for CBN in Naravaripalli : చంద్రబాబు కోసం స్వగ్రామంలో ప్రత్యేక పూజలు

అయితే ఏటా దేశం నలుమూలల నుంచి భక్తులు అంబాబాయి ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రంలోని అనేక మంది భక్తులకు ప్రార్ధనా స్థలంగా ఉంది. అలాగే అంబాబాయి మాతను దర్శించుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది భక్తులు కూడా వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆలయం నుంచి బయటకు వచ్చినప్పుడు జై బాబు అంటూ నినాదాలు చేశారు. వారిని చూసిన చంద్రబాబు ఆగి వారితో కొద్దిసేపు మాట్లాడారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొల్హాపూర్ వస్తున్నందున కొల్హాపూర్ జిల్లా పోలీసు యంత్రాంగం బుధవారమే భద్రతా ఏర్పాట్లను చేసింది. ఈరోజు చంద్రబాబు నాయుడు కొల్హాపూర్​కు చేరుకున్న వెంటనే ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో కొల్హాపూర్​ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఆలయ ప్రాంతంలోని దుకాణాలు కూడా కొద్దిసేపు మూతపడ్డాయి. కొల్హాపూర్​లోని అంబాబాయిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు షిరిడీకి వెళ్లిపోయారు.

తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు దంపతులు

అనంతరం మహారాష్ట్రలోని శ్రీ షిరిడి సాయిబాబాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి దర్శించుకున్నారు. షీర్డీ సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే షిర్డీలో తెలుగువారు అత్యంత సేవాతత్పరతతో నిర్వహిస్తున్న ద్వారకామాయి వృద్ధాశ్రమాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సందర్శించారు. ఆశ్రమానికి వచ్చిన చంద్రబాబు దంపతులకు ద్వారకామాయి వృద్ధాశ్రమ ఛైర్మన్‌ బండ్లమూడి రామ్మోహనరావు, మేనేజింగ్ ట్రస్టీ బండ్లమూడి శ్రీనివాస్‌ సాదర స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు దంపతులు ఆశ్రమంలోని వృద్ధులను పరామర్శించారు. వారితో ఆత్మీయంగా మాట్లాడారు. ద్వారకామాయి వృద్ధాశ్రమ నిర్వహణ తీరును చంద్రబాబు ప్రశంసించారు. బండ్లమూడి శ్రీనివాస్‌ సోదరుల సేవానిరతిని చంద్రబాబు కొనియాడారు. ఆశ్రమ రిజిస్టర్‌లో చంద్రబాబు సంతకం చేశారు. రెండు దశాబ్దాలుగా ఆశ్రమంలో వేలాదిగా వృద్ధులకు ఆశ్రయం కల్పించి వారికి మానవీయ దృక్పథంతో సేవ చేయడం అభినందనీయమని చంద్రబాబు దంపతులు అన్నారు. మానవసేవే మాధవసేవ అనే స్ఫూర్తికి ద్వారకామాయి వృద్ధాశ్రమం సేవలే నిదర్శనమని చంద్రబాబు ప్రశంసించారు. సాయిబాబా దర్శనం అనంతరం చంద్రబాబు దంపతులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.

ఏపీలో ధర్మపరిరక్షణ జరగాలి - తెలంగాణ ఫలితాలపై తర్వాత స్పందిస్తా: చంద్రబాబు

మహారాష్ట్రలోని శ్రీ మహాలక్ష్మి, షిర్డీ సాయిబాబా ఆలయాలను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు - ఘన స్వాగతం పలికిన అధికారులు (ETV Bharat)
Last Updated : May 16, 2024, 9:54 PM IST

ABOUT THE AUTHOR

...view details