Central Home Minister Amit Shah Respond To Floods in AP: భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. రాష్ట్రంలో వరదల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి, తక్షణ సాయం కోసం సిఫారసులు చేసేందుకు హోం శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.
ఈ బృందం వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ, డ్యామ్ భద్రత తదితర అంశాలను అక్కడికక్కడే అంచనా వేయడానికి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. పర్యటన తర్వాత తక్షణ సాయంపై కేంద్ర బృందం సిఫారసు చేస్తుందని తెలిపారు.
పవర్ బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపండి - అమిత్ షాను కోరిన చంద్రబాబు - Chandrababu Phone Call to Amit Shah
CM Chandrababu Thankful To Modi And Amit Shah: ఏపీలో వరద పరిస్థితిపై సత్వరమే స్పందించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర బృందం పర్యటనను స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేంద్ర బృందం సిఫార్సుల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. బాధిత ప్రజలకు సకాలంలో సహాయాన్ని అందించడానికి కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
భారీ వరదలతో విజయవాడ సహా పలు ప్రాంతాల ప్రజలకు అంతులేని కష్టం వాటిల్లింది. ఈ విపత్తునుంచి కోలుకొని సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తోంది. ప్రజలకు పెద్ద ఎత్తున ఆహారం, నిత్యావసరాలను అందిస్తున్నారు. వరద బాధితుల సంఖ్య 6.44లక్షలకు చేరగా వీరిలో 42,707 మందిని 193 సహాయక శిబిరాలకు తరలించారు. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 63వేల కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు అధికారులు గుర్తించారు.
విజయవాడలో వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో బురద నీటి తొలగింపు పనులను మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వీధుల్లో, ఇళ్లలో ఉన్న బురదను అగ్నిమాపక సిబ్బంది శుభ్రం చేసి బ్లీచింగ్ చేస్తున్నారు. 2 వందల 50 ఫైరింజన్‌లతో బురద తొలగింపు కార్యక్రమం చేపట్టారు. దగ్గరుండి పారిశుద్ధ్య పనులు పర్యవేక్షిస్తున్న హాం మంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ నేత నాగుల్ మీరాతో ఈటీవీ ప్రతినిథి ముఖాముఖి నిర్వహించారు.
భారీ వర్షాలు, వరదలతో 32 మంది మృతి - విరాళాలు ఇచ్చేవారికి పన్ను మినహాయింపు - Several People Dead in Floods
వరద బాధితులకు అండగా టాలీవుడ్ హీరోలు - తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం - Donations To Telugu States