Central Govt Releases Funds for Polavaram:పోలవరం పెండింగ్ పనులు పూర్తిచేసేందుకు నిధుల కొరత తీరేలా కేంద్రం శుభవార్త అందించింది. 2 వేల 800 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. పాతబిల్లుల రీయింబర్స్‌మెంట్ కింద 800 కోట్లు, పనులు చేపట్టేందుకు అడ్వాన్సుగా 2వేల కోట్లు ఇచ్చినట్లుగా ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి తొలుత రాష్ట్రప్రభుత్వం నిధులు ఖర్చుచేస్తే రీఎంబర్స్ చేస్తున్నకేంద్రం తొలిసారి అడ్వాన్స్‌గా ఇచ్చింది. జగన్ హయాంలోనూ అడ్వాన్సుగా నిధులు ఇవ్వాలని పదేపదే కోరినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు తొలిసారిగా అంగీకారం తెలిపిన మోదీ సర్కారు తాజాగా ఆ మాట నిలబెట్టుకుంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిర్ణయాలు, నిధుల విషయంలో కేంద్రం వేగంగా అడుగులు నెల క్రితమే 30,436 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు కొత్త డీబీఆర్ను కేంద్రం ఆమోదించింది. ఫలితంగా గతంలో ఇచ్చిన నిధులు పోను 12,157 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అదనంగా పొందేందుకు వీలు చిక్కింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6వేల కోట్లు, వచ్చే ఏడాది 6,157 కోట్లు అడ్వాన్స్‌గా మంజూరు చేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.7 వేల కోట్ల వరకు అవసరమని పోలవరం అధికారులు చెబుతున్నారు.
"అరకు కాఫీ" అదుర్స్ - రైతుల కష్టాలకు చెక్ పెట్టిన టెకీ నిర్ణయం