Center Show Cause Notices AR Dairy Show : తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం నోటీసులు ఇచ్చింది.
తిరుమల లడ్డూ వ్యవహారం - ఏఆర్ ఫుడ్స్‌కు కేంద్రం నోటీసులు - Tirupati Laddu Ghee Controversy - TIRUPATI LADDU GHEE CONTROVERSY
FSSAI Issues Notice to AR Dairy : తిరుమల లడ్డూపై వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లడ్డూకు నెయ్యిని సరఫరా చేసే ఏఆర్ ఫుడ్స్‌కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. గత శుక్రవారం నోటీసులు జారీ చేసినట్లు భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగాలు వెల్లడించాయి.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2024, 8:48 PM IST
Central Notice to Ghee Suppliers in Tirupati Laddu : నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం సేకరించింది. ఈ నేపథ్యంలోనే నాణ్యత పరీక్షలో ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి చెందిన నెయ్యి విఫలమైనట్లు పేర్కొంది. ఈ మేరకు గత శుక్రవారం నోటీసులు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏఆర్ ఫుడ్స్‌తోపాటు మరికొన్ని సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. సంస్థల సమాధానం, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక మేరకు చర్యలు తీసుకుంటామని ఆహార భద్రత ప్రమాణాల విభాగం స్పష్టం చేసింది.