తెలంగాణ

telangana

ETV Bharat / state

మీ ఇంట్లో పాత బైక్​ ఉందా ? అయితే దాన్నే ఎలక్ట్రిక్​ వెహికల్​గా​ మార్చుకోవచ్చు తెలుసా ? - RETROFIT POLICY FOR OLD VEHICLES

రెట్రోఫిట్టింగ్‌పై నగరవాసుల ఆసక్తి - 10-15 ఏళ్లు వాడిన తరువాత బైక్‌లను విద్యుత్తు వాహనాలుగా మార్చుకునే అవకాశం - కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్యల నుంచి కూడా ఉపశమనం

NEW POLICY FOR OLD VEHICLES
Retrofit to Convert Old Vehicle to EV in India (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2024, 11:14 AM IST

Updated : Oct 15, 2024, 3:41 PM IST

Retrofit to Convert Old Vehicle to EV in India : పాత బైక్​లను ఎలక్ట్రిక్ వెహికల్స్​గా మార్చే విధానానికి నగరంలో ఆదరణ పెరుగుతోంది. ఫలితంగా రెట్రోఫిట్టింగ్​పై ఆసక్తి చూపుతున్నారు. 10 నుంచి 15 ఏళ్లవపాటు వాడిన బైకులను చాలామంది వాటిని తక్కువ ధరకు అమ్మేయడం లేదా షెడ్డు పరిమితం చేస్తుంటారు. మళ్లీ కొత్త వాహనం కోసం లక్షలు పెట్టి కొంటుంటారు. తాజాగా కేంద్రం రెట్రోఫిట్‌ పాలసీకి ఆమోద ముద్ర వేయడంతో పాత వాహనాలకు ప్రాణం పోయవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా పెట్రోల్​తో నడిచే బైక్‌లను రెట్రోఫిట్టింగ్‌తో బ్యాటరీ బైక్‌లుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అదనంగా మరో పదేళ్లపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా అవకాశముందని నిపుణులు అంటున్నారు.

మరి బ్యాటరీతో నడిచే బైక్​లుగా మార్చే ముందు రెట్రోఫిట్టింగ్‌కు సంబంధించి సరైన సంస్థను ఎంపిక చేసుకోవడం కీలకం. ఇలాంటి సంస్థలకు ఆటోమొబైల్‌ రీసెర్చి అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఏఆర్‌ఏఐ) గుర్తింపు ఉందా లేదా అని పరిశీలించాలి. నాణ్యమైన బ్యాటరీల కోసం ఈ గుర్తింపు చాలా ముఖ్యం. బ్యాటరీలకు ఒక రెండు సంవత్సరాల వరకు గ్యారంటీని కూడా ఈ సంస్థలు అందిస్తాయి. బ్యాటరీల్లో నాణ్యత తగ్గినప్పుడు కొన్నిసార్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఏఆర్‌ఏఐ సర్టిఫికేషన్‌ ఉన్న వాటికే నాణ్యతకు గ్యారంటీ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

విద్యుత్​ బైక్​లతో పర్యావరణానికి మేలు :నగరంలో ఎక్కడా చూసినా వాహనాలే. దీని వల్ల ట్రాఫిక్​ కూడా పెరుగుతోంది. ఎక్కువగా టూ వీలర్​ వెహికల్స్​ ఉంటున్నాయి. నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో కనీసం రెండు ద్విచక్రవాహనాలు తప్పనిసరిగా అవుతోంది. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఫలితంగా రోడ్లుపై ఫుల్​ ట్రాఫిక్​ ఉంటుంది. దీని వల్ల కాలుష్యం కూడా అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పాత వాహనాలను విద్యుత్​ బైకులుగా మార్చాడం ద్వారా పర్యావరణానికి మేలు జరగనుంది.

వ్యయం ఇలా :

  • ప్రస్తుతం ఒక బైక్​ను విద్యుత్​ బైక్​గా మార్చేందుకు కిట్‌తోపాటు బ్యాటరీకి దాదాపు రూ.60 నుంచి 70 వేల వరకు ఖర్చు అవుతోంది.
  • ఫ్యూచర్​లో కిట్​తోపాటు బ్యాటరీల ధరలు తగ్గితే రూ. 20 నుంచి 30 వేలలోనే ఈ సదుపాయాన్ని పొందొచ్చు.
  • నగరంలో బైక్​లు, కార్లు, ఇతర వాహనాలు కలిపి దాదాపు 80 లక్షలు దాటాయి.
  • రోజూ మూడు వేలకు పైగా కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి.
  • 10 నుంచి 15 ఏళ్లు వాడిన బైక్​లనూ విద్యత్తు వాహనాలుగా మార్చుకునే అవకాశం ఉంది.
  • బ్యాటరీల్లో వివిధ రకాల ఆధారంగా 50 నుంటి 150 కిలోమీటర్ల వరకు నిరాటంకంగా నడపవచ్చని నిపుణులు వివరిస్తున్నారు.
  • 100 నుంచి 150 కిలోమీటర్ల సామర్థ్యం కలిగిన బ్యాటరీ కావాలంటే 30 నుంచి 35 వేల రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుంది.
Last Updated : Oct 15, 2024, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details