ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టివేత- 25వేల కిలోలు స్వాధీనం చేసుకున్న సీబీఐ - CBI SEIZED 25 THOUSAND KGS DRUGS - CBI SEIZED 25 THOUSAND KGS DRUGS

CBI Seizes Huge Consignment of Drugs in Visakahaptanm Port : విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం రేపింది. బ్రెజిల్ నుంచి విశాఖలోని ఓ ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు వచ్చిన కంటైనర్ సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కంటైనర్​లో ఉన్న 25 వేల కిలోల డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు.

CBI Seizes Huge Consignment of Drugs
CBI Seizes Huge Consignment of Drugs

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 7:29 PM IST

Updated : Mar 21, 2024, 10:59 PM IST

CBI Seizes Huge Consignment of Drugs in Visakahaptanm Port: విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం రేగింది. బ్రెజిల్ నుంచి కంటైనర్‌లో విశాఖకు 25 వేల కిలోల డ్రగ్స్ చేరింది. ఇంటర్‌పోల్ సమాచారంతో రంగంలోకి దిగిన దిల్లీ సీబీఐ కార్యాలయం, విశాఖ సీబీఐ, కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేసింది. 25 కిలోల చొప్పున వెయ్యి బ్యాగులు ఉన్నట్లు గుర్తించింది. జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈనెల 16న విశాఖ వచ్చినట్లు గుర్తించింది. ఈ మేరకు ఈ నెల 19న నార్కోటిక్స్ నిపుణులతో వచ్చి సీబీఐ నిర్ధారించుంది.

బ్రెజిల్ నుంచి ఎస్​ఈకెయు 4375380 కంటైనర్ లో వచ్చిన ఈసరకును సీజ్ చేసినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్​లో పేర్కొంది. ఎల్​ఏబి 224348 ఓషన్ నెట్ వర్క్ ఎక్ప్రెస్ తో సీల్ చేసి ఉన్న కంటైనర్​లో డ్రగ్స్ గుర్తించినట్లు సీబీఐ తెలిపింది. 1000 బ్యాగుల్లో ఎండిన ఈస్ట్ ఇందులో ఉన్నట్టుగా కంపెనీ ప్రతినిధులు వివరణ ఇచ్చారని తెలిపింది. అయితే, లాసన్స్ బే కాలనీలో ఉన్న సంధ్యా అక్వా ఎక్ప్సోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ ప్రతినిధుల సమక్షంలోనే సీబీఐ, పోర్టు అధికారులు కంటైనర్ ను తెరిచారు.

ప్లాస్టిక్ బ్యాగ్​లలో పసుపు రంగులో ఉన్నపదార్థాన్ని ఎన్​సిబి డ్రగ్స్ డిటెక్షన్ కిట్ ద్వారా పరీక్షించారు. పరీక్షించిన అన్నింటిలోనూ కొకైన్, మెధాక్వలైన్ ఉన్నట్టు పాజిటివ్ వచ్చిందని ఎఫ్​ఐఆర్ లో సీబీఐ పేర్కొంది. నార్కొటిక్స్ నిపుణులు ప్రతి ఒక్క బ్యాగ్​లో ఉన్న పదార్దానికి టెస్ట్ ఎ, బి, ఈ టెస్ట్​లు నిర్వహించారు. టెస్ట్ ఎ పాజిటివ్ అంటే ఓపియం, మార్ఫిన్, కొకైన్, హీరాయిన్, అంఫీటెర్మైన్స్ మెసాక్ లైన్ ఉన్నట్టు. టెస్ట్ బి పాజిటివ్ అంటే మారిజునా, హషిష్ ఆయిల్ ఉన్నట్టు. టెస్ట్ ఈ పాటిజిట్ అంటే కొకైన్, మెుధాక్వైలైన్ ఉన్నట్లు అర్థం.

మొత్తం 49 శాంపిల్స్ చెక్ చేస్తే అందులో 27లో టెస్ట్ ఎ పాజిటివ్ వచ్చినట్లు సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్​లో వెల్లడించారు. మిగిలిన వాటిల్లో టెస్ట్ ఈ పాజిటివ్ గా తేలినట్టు గుర్తించారు. చెక్ చేసిన ఫలితాల తర్వాత కంపెనీ ప్రతినిధులకు సీబీఐ పలు ప్రశ్నలు సందించింది. అయితే ఆ ప్రశ్నలకు కంపెనీ ప్రతినిధులు సంతృప్తికర సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. కంపెనీ ప్రతినిధులు, సీబీఐ అధికారుల బృందం సమక్షంలో తిరిగి ఆ ఆకంటైనర్​కు అధికారులు సీల్ వేశారు.


నేవీ, NCB భారీ ఆపరేషన్- 3,300 కిలోల డ్రగ్స్ సీజ్- విలువ రూ.వెయ్యి కోట్లపైనే

గత రెండు రోజుల నుంచి సీబీఐ తనిఖీల ప్రక్రియ నిర్వహించింది. కంటైనర్ సీల్ తీసిన దగ్గర నుంచి పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్ రావడం మళ్లీ దానిని సీల్ చేయడం వరకు అన్నింటిని సీబీఐ అధికారులు వీడియో గ్రఫీ తీశారు. ఆ కంటైనర్లను సీబీఐ అధికారులు పోర్టు అధారిటీ ఆధీనంలో ఉంచారు. మరింత భద్రత కోసం సీబీఐ తన సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. ఎన్​డిపిఎస్ చట్టం అండర్ సెక్షన్ 29 రెడ్ విత్ 8,23, 38 ప్రకారం సంధ్య అక్వా ఎక్ప్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సహా, గుర్తుతెలియని మరికొందరిపైనా కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎఫ్ఐర్​లో పేర్కొంది.

విశాఖ తీరంలో భారీ డ్రగ్స్ పట్టివేతపై చంద్రబాబు, పవన్ స్పందన- జగన్ సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ - Chandrababu reacted on Drugs Case

Last Updated : Mar 21, 2024, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details