ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు - జనవరి నుంచి పనులు

రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం - అమరావతిలో ఈఎస్ఐ ఆస్పత్రి, వైద్యకళాశాలకు 20 ఎకరాల కేటాయింపునకు ఆమోదం

narayana_on_land_allotments
narayana_on_land_allotments (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2024, 7:21 PM IST

Land Allocations to Various Institutions in Amaravati:రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయ్యింది. రాజధాని అమరావతిలో ఈఎస్ఐ ఆస్పత్రితో పాటు వైద్యకళాశాల కోసం 20 ఎకరాల కేటాయింపునకు కమిటీ ఆమోదం తెలిపింది. గత టీడీపీ ప్రభుత్వంలో కేటాయించిన పలు సంస్థలకు సమయం ముగియడంతో మరోసారి గడువు పొడిగించింది. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ కు 5 ఎకరాలు, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి 0.8 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్​కు 15 ఎకరాలు కేటాయించింది. లార్సన్ అండ్ టుబ్రో స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్​కి 5 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.

బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీ కి 10 ఎకరాలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. టీటీడీకి గతంలో కేటాయించిన 25 ఎకరాలకు మంత్రివర్గ ఉపసంఘం అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు. 131 మందికి గతంలో భూములు ఇచ్చామని వాటితో పాటు కొత్త వారికి కూడా భూములు ఇస్తున్నామని వివరించారు. గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు ఇస్తున్నామని ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామని మంత్రి నారాయణ వివరించారు. వచ్చే నెలాఖరులోగా భూకేటాయింపులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ డిసెంబరు నెలాఖరుకు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయని అన్నారు. వచ్చే జనవరి నుంచి రాజధానిలో పనులు మొదలవుతాయని మంత్రి నారాయణ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details