తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2024, 5:15 PM IST

ETV Bharat / state

'బీఆర్ఎస్‌లో కార్యకర్తలకు విలువ లేదు - అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది'

BRS Workers Meeting In Karimnagar : కరీంనగర్ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పలువురు కార్యకర్తలు నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యకర్తలను ఎన్నికల కోసం వాడుకోవడం తప్ప ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదని తీవ్ర ఆగ్రహం చెందారు. అందువల్లే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైందని వాపోయారు.

BRS Workers Fire on Leaders
BRS Workers Meeting In Karimnagar

బీఆర్ఎస్ కార్యకర్తల అసంతృప్తి - ఎన్నికల కోసం వాడుకోవడం తప్ప పట్టించుకోవడం లేదని ఆగ్రహం

BRS Workers Meeting In Karimnagar : కరీంనగర్ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పలువురు కార్యకర్తలు నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్న ఉద్యమకారులకు మాత్రం న్యాయం జరగలేదంటూ అందోళన చెందారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్​తో పాటు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు.

రసమయి బాలకిషన్ మాట్లాడుతున్న క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్త తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యకర్తలను ఎన్నికల కోసం వాడుకోవడం తప్ప ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదని తీవ్ర ఆగ్రహం చెందారు. అందువల్లే మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని వాపోయారు. ఈ క్రమంలో ఇతర కార్యకర్తలు లేచి అతడిని మందలించడంతో కాసేపు గందరగోళం నెలకొంది.

కాంగ్రెస్​ 420 హామీలు చూసి జనం మోసపోయారు - చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది : కేటీఆర్

BRS Worker Fires on High Command :పలువురు బీఆర్ఎస్ నేతలు అసలు కార్యకర్తలను పట్టించుకోరని ఓ కార్యకర్త ఆరోపించారు. ఎన్నికలప్పుడు మాత్రమే ఆయనకు కార్యకర్తలు గుర్తుకు వస్తారని మండిపడ్డారు. రాగానే కార్యకర్తలు గుర్తుకు వస్తారని ఆ తర్వాత గుర్తుపట్టరని అసహనం వ్యక్తం చేశారు. సమావేశాలు పెట్టి పార్టీని గెలిపించాలని పెడితే సరిపోదని చిన్న లీడర్లను కూడా పట్టించుకోవాలని అన్నారు. అతడికి నచ్చచెప్పేందుకు పలువురు నాయకులు యత్నించినా ససేమీరా అనడంతో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది.

BRS Meeting On Lok Sabha Election 2024: గత ఎన్నికల్లోను తాము పార్టీ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా తమకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని కేవలం కార్పొరేటర్లకు మాత్రమే బాధ్యతలు అప్పగించారని సదరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కార్పొరేటర్లు చెప్తేనే ఓట్లు వేస్తారా అని నిలదీశారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు తమపై ఎన్నో కేసులు ఉన్నాయని అయినా పార్టీలో ఎలాంటి గుర్తింపు లేదని వాపోయారు.

దళిత బంధు కూడా ఇచ్చాం కదా అని మాజీ మంత్రి గంగుల నచ్చ చెప్పే యత్నం చేసినా రాష్ట్రంలో ఇతరులకు ఇచ్చినట్టే తాను దళితుణ్ణి కాబట్టే సీఏం కేసీఆర్ దళితబంధు ఇచ్చారని అందులో వేరే ఉద్దేశమేం లేదని కార్యకర్త సమాధానం ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా ప్రతినిధులు పని చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కార్యకర్తలకు సూచించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.

'బీఆర్ఎస్​ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో ఎంతో నష్టపోయాం - వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించండి'

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు రంగంలోకి కేసీఆర్ - వచ్చే వారం నల్గొండలో భారీ బహిరంగ సభ

ABOUT THE AUTHOR

...view details