ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సూర్యాస్తమయం తర్వాత కవితను అరెస్టు చేశారనడం అవాస్తవం : ఈడీ

BRS MLC Kavitha Arrest Live Updates : దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టైన విషయం తెలిసిందే. ఉదయం దిల్లీలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రౌస్‌ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో కవితను హాజరుపరచనున్నారు.

BRS MLC Kavitha Arrest Live Updates
BRS MLC Kavitha Arrest Live Updates

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 10:46 AM IST

Updated : Mar 16, 2024, 2:53 PM IST

BRS MLC Kavitha Arrest Live Updates: కవిత రిమాండ్ అప్లికేషన్‌ను ఈడీ తరఫు న్యాయవాది జోసెబ్ హుస్సేన్ కోర్టుకు అందించారు. అరెస్ట్ చేయడానికి కారణాలు అన్నీ రిమాండ్ రిపోర్టులో ఈడీ చెప్పిందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5:43 అరెస్టు చేసినట్లు లిఖితపూర్వకంగా చెప్పారని వివరించారు. శుక్రవారం తెలంగాణలో సూర్యాస్తమయం 6:26 గంటలకు జరిగిందని, సూర్యాస్తమయం తర్వాత కవితను అరెస్టు చేశారనడం అవాస్తవమని అన్నారు. నిన్న జరిగిన సోదాల్లో మొత్తం 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని, మొత్తం వీడియో రికార్డు చేసి పబ్లిక్ డొమైన్‌లో ఈడీ పెట్టిందని జోసెబ్ హుస్సేన్ వెల్లడించారు.

కవిత దాఖలు చేసిన పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వులు లేవు : జోసెబ్ హుస్సేన్

ఈడీ తరఫున న్యాయవాది జోసెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. తీవ్రమైన చర్యలు తీసుకోవద్దు అని ఉత్తర్వులు ఇవ్వలేదని చెప్పారు. మీడియాలో వచ్చిన విషయాలను పరిగణనలోకి తీసుకోవద్దని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సెప్టెంబర్ 15న వచ్చే 10 రోజుల్లో సమన్లు ఇవ్వమని మాత్రమే చెప్పామని అన్నారు. విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని ఏఎస్జీ చెప్పారని పేర్కొన్నారు.

ఒక ఆర్డర్ అనుకూలంగా ఉంటే దానిని నిరవధిక కాలానికి అన్వయించుకోవద్దని జోసెబ్ హుస్సేన్ కోర్టుకు వివరించారు. వేరే వారికి ఇచ్చిన ఉత్తర్వులను అన్వయించుకోవద్దని చెప్పారు. మధ్యంతర ఉత్తర్వును మెుత్తానికి వర్తించుకోవడం మంచిది కాదని అన్నారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన ప్రకటన కోర్టు ఉల్లంఘన కిందకి రాదని తెలిపారు. తీవ్ర చర్యలు తీసుకోవద్దని ఎలాంటి ఉత్తర్వులు లేవని జోసెబ్ హుస్సేన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

కవిత సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి మాత్రమే చేశారని జోసెబ్ హుస్సేన్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఏఎస్జీ చెప్పిన 10 రోజుల గడువు ఎప్పుడో తీరిందని తెలిపారు. గడువు తీరాక ఎన్నోసార్లు కోర్టులో విచారణ జరిగిందని వివరించారు. సెప్టెంబర్ 15న ఇచ్చిన అండర్ టేకింగ్‌నే ప్రస్తావిస్తూ ఉన్నారని చెప్పారు. కవిత దాఖలు చేసిన పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వులు లేవని అన్నారు.

నళినీ చిదంబరం పిటిషన్‌లో ఇచ్చిన ఉత్తర్వులనే వీళ్లు అన్వయించుకుంటున్నారని జోసెబ్ హుస్సేన్ వివరించారు. మీడియాలోని వార్తలనే పరిగణనలోకి తీసుకోవాలంటున్నారని, అదే మీడియాలో అనేక కథనాలు కవితకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. ఈ వ్యవహారంలో సీఆర్పీసీ సెక్షన్లు ఇప్పుడు వర్తించవని ఈడీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

సుప్రీంకోర్టులో మౌఖికంగా చెప్పిన మాటను ఈడీ ఉల్లంఘించింది : విక్రమ్‌ చౌదరి

శుక్రవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. వాదనలు పూర్తయ్యాక కేసు విచారణ వాయిదా పడిందని చెప్పారు. వాయిదా పడిన కొద్దిసేపటికే కవిత ఇంట్లో తనిఖీలు చేశారని పేర్కొన్నారు. సోదాలు అయ్యాక ఆమెను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారని కోర్టుకు వివరించారు.

ఈనెల 19న మరోసారి కవిత పిటిషన్‌పై విచారణ ఉందని విక్రమ్ చౌదరి పేర్కొన్నారు. ఈనెల 19 వరకు ఈకేసు విచారణ ఇక్కడ నిలుపుదల చేయాలని కోర్టుకు తెలిపారు. కవితకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. గతంలో ఆమెను సీబీఐ అధికారులు 8 గంటలు విచారించారని గుర్తు చేశారు. శుక్రవారం మరోసారి కేసు విచారణకు వచ్చిందని వివరించారు. విచారణలో జరిగిన వాదనలను జడ్జి నాగపాల్‌కు విక్రమ్‌ చౌదరి వివరించారు.

సుప్రీంకోర్టుకు అండర్‌ టేకింగ్‌ ఇచ్చారని విక్రమ్ చౌదరి వివరించారు. కోర్టులో అండర్‌ టేకింగ్‌ ఇచ్చినవాళ్లే దానిని ఉల్లంఘించారని తెలిపారు. మెుత్తం కేసు క్వాష్‌ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌ విచారణ జరుగుతుందని అయినా కవితను అరెస్టు చేశారని పేర్కొన్నారు.

మహిళల విచారణపై మరో కేసుకు కవిత కేసును జత చేశారని కోర్టుకు విక్రమ్ చౌదరి తెలిపారు. నళినీ చిదంబరం వేసిన కేసుకు కవిత కేసును జత చేశారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ తీరును కోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టులో మౌఖికంగా చెప్పిన మాటను ఈడీ ఉల్లంఘించిందని విక్రమ్ చౌదరి అన్నారు.

Last Updated : Mar 16, 2024, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details