ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు - కవిత ఈడీ కస్టడీ మరో మూడ్రోజులు పొడిగింపు - BRS Leader Kavitha ED Custody - BRS LEADER KAVITHA ED CUSTODY

BRS Leader Kavitha ED Custody Extended : దిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరో ఐదు రోజుల పాటు ఆమెను కస్టడీకి కోరగా మూడ్రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 7:50 PM IST

BRS Leader Kavitha ED Custody Extended :దిల్లీ మద్యం కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. విచారణ నిమిత్తం గతంలో వారం రోజుల పాటు కోర్టు ఇచ్చిన కస్టడీ నేటితో ముగియడంతో ఇవాళ మరోమారు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఆమెను అధికారులు హాజరుపరిచారు. కవితను మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన ఈడీ న్యాయవాది, కస్టడీ పొడిగిస్తే దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు మరికొందరిని కవితతో కలిసి విచారించనున్నట్లు చెప్పారు.

Kavitha ED Custody Ended :కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన ఈడీ న్యాయవాది, కవిత కుటుంబ సభ్యులకు సంబంధించి వివరాలు వెల్లడించ లేదని చెప్పారు. కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. మద్యం కేసులో సమీర్ మహేంద్రును విచారించాల్సి ఉందని, మేకా శరణ్ నివాసంలో సోదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని వెల్లడించారు.

దిల్లీ లిక్కర్ కేసులో తెరపైకి మరోపేరు - కవిత అల్లుడి పాత్రపై ఈడీ ఆరా - DELHI EXCISE POLICY UPDATES

కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు (ED On Kavitha Custody), వైద్యులు సూచించిన ఆహారాన్నే ఇస్తున్నామని వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కవిత కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నెల 26వ తేదీ వరకు ఆమె ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఈడీ అధికారులు ఐదు రోజుల కస్టడీని కోరగా రౌస్ అవెన్యూ కోర్టు మూడ్రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది.

లిక్కర్ పాలసీ కేసు- సీఎం కేజ్రీవాల్‌కు మార్చి 28వరకు ఈడీ కస్టడీ - Arvind Kejriwal Arrest

మద్యం కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఇప్పటికే కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ (Kejriwal ED Custody), కవితను ఒకేసారి ప్రశ్నించే యోచనలో ఈడీ అధికారులు ఉన్నారు. ఇద్దరినీ కలిపి ప్రశ్నించేందుకు కవిత కస్టడీ పొడిగింపు కోరగా కోర్టు అనుమతించింది. మరోవైపు సీబీఐ కోర్టులో కవిత తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ (Kavitha Bail Petition) దాఖలు చేశారు. వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో కోరారు. మరోవైపు కోర్టుకు వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడారు. తనను ఈడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. తనపై పెట్టిన కేసులపై న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు.

అవినీతి వ్యతిరేక పోరాటం నుంచి మద్యం స్కామ్​లో అరెస్ట్​- కేజ్రీ వారసత్వం ఎవరికో? - Kejriwal ED Arrest

ABOUT THE AUTHOR

...view details