Young Man Brutally killed Young Woman for Rejecting Love:సమాజంలో రోజురోజుకు ఆడవారిపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. మహిళలు కనిపిస్తే చాలు క్రూరమృగాలుగా మారి అఘాయిత్యాలకు పాల్పడుతున్నవారు కొందరు. వావి వరసలు మరిచి అత్యాచారాలకు తెగబడుతున్నవారు మరికొందరు. ప్రేమిస్తున్నామంటూ వెంట పడతారు అమ్మాయి ఒప్పుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు. తనకు అమ్మాయి దక్కలేదనే కక్షతో దాడులకు తెగబడుతున్నారు. అంతేకాదు ప్రాణాలు సైతం తీసేందుకు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఏలూరు పట్టణంలో జరిగింది.
ప్రేమించాలంటూ వేధింపులు:ఏలూరు ఎమ్మార్సీ కాలనీలో దారుణం జరిగింది. ప్రేమిస్తున్నానంటూ ఓ యువతి వెంట యువకుడు పడ్డాడు. అతడి ప్రేమను ఆమె నిరాకరించింది. దీంతో తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో దారుణంగా నరికి చంపాడు. ఎమ్మార్సీ కాలనీకి చెందిన జక్కుల రత్న గ్రేస్ అనే యువతిని తొట్టిబోయిన ఏసురత్నం అనే యువకుడు కొంత కాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం యువతి తన ఇంటి సమీపంలో ఉండగా ఆమె వద్దకు వచ్చాడు.