ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెజవాడ బస్టాండ్​లో బ్లేడ్​బ్యాచ్, యాచకుల వీరంగం - ఏకంగా పోలీసులపైనే దాడి - Blade Batch Hulchul in Vijayawada - BLADE BATCH HULCHUL IN VIJAYAWADA

Blade Batch Hulchul at Vijayawada Bus Stand: బెజవాడలో బ్లేడ్​బ్యాచ్, యాచకులు వీరంగం సృష్టించారు. ఏకంగా పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై బ్లేడ్​లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

Blade_Batch_Hulchul_at_Vijayawada_Bus_Stand
Blade_Batch_Hulchul_at_Vijayawada_Bus_Stand

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 9:24 AM IST

Updated : Mar 24, 2024, 11:45 AM IST

బెజవాడ బస్టాండ్​లో బ్లేడ్​బ్యాచ్, యాచకుల వీరంగం - ఏకంగా పోలీసులపైనే దాడి

Blade Batch Hulchul at Vijayawada Bus Stand: విజయవాడ బస్టాండ్‌లో బ్లేడ్‌బ్యాచ్‌, యాచకులు వీరంగం సృష్టించారు. మద్యం తాగి రాత్రంతా బస్టాండ్‌లో ఉన్న బెంచీలను ఆక్రమించి, వాటిపై పడుకుంటూ రాకపోకల సాగించే ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పోలీసుల సాయంతో అధికారులు వారిని వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు.

ఫొటోగ్రాఫర్‌పై కటర్​తో దాడి - బ్లేడ్ బ్యాచ్ పని కాదన్న పోలీసులు

అయితే అక్కడి నుంచి కదిలేది లేదంటూ వందమందికి పైగా యాచకులు ఒక్కసారిగా బ్లేడ్‌లతో ఆదివారం తెల్లవారుజామున దాడికి దిగారు. యాచకుల దాడితో పోలీసులు, ఆర్టీసీ అధికారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ దాడిలో ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ వై.శ్రీనివాసరావు, పొరుగుసేవల సిబ్బంది సాంబయ్యకు, గాయాలు అయ్యాయి.

అదనపు పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవటంతో బ్లేడ్‌బ్యాచ్‌, యాచకులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి పాల్పడ్డ వారిలో కొందరిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. యాచకులకు ఆర్టీసీ సిబ్బందికి మధ్య గంటపాటు జరిగిన ఘర్షణతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్టాండ్ నుంచి పంపించటాన్ని నిరసిస్తూ యాచకులు ఆందోళనకు దిగారు.

విజయవాడ పుష్కర ఘాట్​లో యథేచ్చగా గంజాయి, బ్లేడ్ బ్యాచ్ దందా - నిఘా గాలికొదిలేసిన పోలీసులు

Last Updated : Mar 24, 2024, 11:45 AM IST

ABOUT THE AUTHOR

...view details