ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ రివర్స్ టెండరింగ్​తో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం: లంకా దినకర్ - Lanka Dinkar on Polavaram Project - LANKA DINKAR ON POLAVARAM PROJECT

BJP Official Spokesperson Lanka Dinkar on Polavaram Project: వైఎస్సార్​సీపీ ప్రభుత్వం చేసిన రివర్స్ టెండరింగ్ కారణంగా పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లిందని బీజేపీ అ‍ధికార ప్రతినిధి లంకా దినకర్‌ అన్నారు. సీఎం చంద్రబాబు పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతం అయ్యాయని వెల్లడించారు. 2019 ముందు 70 శాతం పనులు పూర్తయ్యయని కానీ జగన్ పాలనలో 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు. 4 సంవత్సరాలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేసినా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాని పరిస్థితి ఏర్పడిందన్నారు.

lanka_dinkar_on_polavaram_project
lanka_dinkar_on_polavaram_project (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 3:39 PM IST

BJP Official Spokesperson Lanka Dinkar on Polavaram Project:పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడం వల్ల వాస్తవాలు బహిర్గతం అయ్యాయని బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి లంకా దినకర్‌ అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని ఆయన పేర్కొన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పరిగణించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్ట్ 2019కి ముందు మొత్తం 72 శాతం వరకు పూర్తయిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన తరువాత ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు 14,418.39 కోట్ల రూపాయలని తెలిపారు.

2019 ముందు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు వ్యయంలో, సహాయ, పునరావాస వ్యయం అంచనాలలో పూర్తి అవినీతిమయంగా ఉందని జగన్ ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు చూపకుండా గత ప్రభుత్వం తయారు చేసిన అంచనాలనే కేంద్ర ప్రభుత్వ ఆమోదం కొరకు ప్రయత్నించారని తెలిపారు. రివర్స్ టెండరింగ్ అంటూ ప్రాజెక్టు వ్యయం తగ్గించామనే ప్రచారం చేసినప్పుడు ప్రాజెక్టు వ్యయం తగ్గకపోగా దాదాపు మరో 33 శాతం పెరిగిందని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అనాలోచిత రివర్స్ టెండరింగ్ వల్ల ఈ ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరిగిందని మండిపడ్డారు.

జగన్ పాలనలో రివర్స్ టెండరింగ్‌ వల్ల పోలవరం ప్రాజెక్టులో తీవ్ర నష్టం జరిగింది: లంకా దినకర్ (ETV Bharat)

వైఎస్సార్సీపీ అరాచక 'బంటు'లపై డేగ కన్ను - చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం - Govt Focus on YSRCP Anarchies

రివర్స్ టెండరింగ్ వల్ల భవిష్యత్ నష్టాల గురించి 2019లోనే తాము హెచ్చరించాం. ఈ ప్రాజెక్ట్ పురోగతికి వైసీపీ ప్రభుత్వ అవినీతి కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాజెక్ట్​ల నిర్మాణాలకు తీవ్ర నష్టం జరిగింది. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు, ఫ్యాక్టరీలకు పారిశ్రామిక నీటిని అందించడంలో వైఎస్‌ జగన్‌ రాజీపడినందున రాష్ట్రంలోని ప్రజలంతా తమ అవసరాలను, అవకాశాలను కోల్పోయారు. -లంకా దినకర్​, బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి

పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్​లతో వైసీపీ ప్రభుత్వం సమన్వయంతో పని చేయలేదని లంకా దినకర్ తెలిపారు. రాబోయే 4 సంవత్సరాలలో ఎన్డీఏ నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర సహకారంతో పోలవరం ప్రాజెక్ట్​ను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం పూర్తి చేయడంతోపాటు తప్పనిసరిగా మహానది - గోదావరి - కృష్ణ - పెన్నా - కావేరి నదుల అనుసంధానం చేసి అనువైన ప్రాంతాలలో నీటి నిల్వ ట్యాంకుల నిర్మాణం చేయడం ద్వారా అన్ని రాష్ట్రాల, దేశ పురోగతికి ఇది దోహద పడుతుందని లంకా దినకర్‌ తెలిపారు.

వెలుగులోకి విడదల రజని ముఠా వసూళ్ల దందా - Vidadala Rajini Corruptions

పోలవరం ప్రాజెక్టుకు శాపంలా జగన్‌ - నిపుణుల కమిటీ నివేదికే కీలకం: చంద్రబాబు - white paper on the Polavaram

ABOUT THE AUTHOR

...view details