తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచే నామినేషన్ల పర్వం - తొలిరోజు నామపత్రాలు దాఖలు చేయనున్న బీజేపీ నేతలు వీరే - lok sabha elections 2024

BJP Candidates Nominations in Telangana 2024 : నామినేషన్ల తొలిరోజు నుంచే బీజేపీ అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. రఘునందనరావు, ఈటల రాజేందర్, డీకే.అరుణ ఇవాళ నామినేషన్లు వేయనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇందుకు హాజరుకానున్నారు. ర్యాలీలు, సభలతో అట్టహాసంగా నామపత్రాల దాఖలు చేసేలా కమలదళం కార్యాచరణ సిద్ధం చేసింది.

TG BJP Candidates Nominations
FirstDay Nominations in Telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 7:04 AM IST

నామినేషన్లు షురూ- తొలిరోజే నామాపత్రాలు సమర్పించనున్న పలువురు బీజేపీ అభ్యర్థులు

BJP Candidates Nominations in Telangana 2024 : తొలి రోజే నామినేషన్ వేసేందుకు బీజేపీ అభ్యర్థులు సన్నద్దమయ్యారు. ఇవాళ మెదక్ అభ్యర్థి రఘునందన్‌రావు, మహబూబ్‌నగర్ అభ్యర్థి డీకే అరుణ, మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఉదయం 11.30 ముహూర్తం ప్రకారం రఘునందనరావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇందుకు హాజరుకానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మెదక్‌లో భారీ ర్యాలీ చేపట్టనున్నారు.

TG BJP Candidates Nominations 2024 : మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉదయం 11 గంటలకు మేడ్చల్ కలెక్టరేట్‌లో నామినేషన్ వేయనున్నారు. కేంద్రమంత్రులు హర్‌దీప్‌సింగ్ పూరి, కిషన్ రెడ్డి ఉదయం 8 గంటలకు శామీర్​పేటలోని ఈటల నివాసం సమావేశం అనంతరం ర్యాలీగా వెళ్లనున్నారు. మహబూబ్​నగర్ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ పాల్గొననున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి రేపు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. కిషన్​రెడ్డి నామినేషన్‌కు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇవాళ సాయంత్రమే హైదారాబాద్‌ రానున్న రాజ్‌నాథ్ సికింద్రాబాద్ సిక్ విలేజ్‌లోని జువెల్ గార్డెన్ మాజీ సైనిక ఉద్యోగులతో సమావేశంకానున్నారు. కిషన్‌రెడ్డితో పాటు ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోద్​రావు నామినేషన్‌కు సైతం రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరుకానున్నారు.

మోదీ గ్యారంటీలే అస్త్రం - లోక్​సభ పోరులో జోరుగా బీజేపీ ప్రచారం - LOK SABHA ELECTION 2024

22న జహీరాబాద్‌ అభ్యర్థి బీబీ పాటిల్ నామినేషన్‌కు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నల్గొండ అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్‌ దాఖలు కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి పీయూశ్​ గోయల్ పాల్గొననున్నారు. మహబూబాబాద్ అభ్యర్థి సీతారాం నాయక్ నామినేషన్​కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

ఈ నెల 23న భువనగిరి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ వేయనున్నారు. 24న పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆ తరువాత వరంగల్ అభ్యర్థి ఆరూరి రమేష్ నామినేషన్ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొననున్నారు. ఆదిలాబాద్ అభ్యర్థి గోడం నగేశ్ నామినేషన్ దాఖలు కోసం ఛత్తీస్‌గఢ్ సీఎం శ్రీవిష్ణు దేవుసాయి రానున్నారు.

హైదరాబాద్ అభ్యర్థి మాధవి లత నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరుకానున్నారు. 25న కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్‌కు గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ పాల్గొననున్నారు. నిజామాబాద్ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు కోసం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, నాగర్ కర్నూలు అభ్యర్థి పోతుగంటి భరత్ నామినేషన్ కోసం గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ హాజరుకానున్నారు. నామినేషన్ దాఖలు ప్రక్రియను అట్టహాసంగా చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.

2047 వికసిత్ భారత్ కోసం పెద్ద ప్రణాళికలు- ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు : మోదీ - Modi Interview Lok Sabha Polls

తెలంగాణలో గజదొంగలు పోయి - ఘరానా దొంగలు వచ్చారు : కిషన్‌రెడ్డి - KISHAN REDDY STRIKE

ABOUT THE AUTHOR

...view details