Bhadradri Water level Increased Due To Heavy Rain Fall :రాష్ట్రంలో విరామం లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం 24 అడుగులు ఉన్న నీటిమట్టం శనివారం ఉదయానికి 31.5 అడుగులకు చేరింది. భద్రాచలం ఎగువ ప్రాంతాలైన తాలిపేరు, కాళేశ్వరం, సమ్మక్క సారక్క బ్యారేజీల నుంచి వరద నీరు వస్తున్నందున గోదావరి నీటిమట్టం పెరుగుతోందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. పెరిగిన వరద వల్ల గోదావరి నీటిమట్టం భద్రాచలం స్నాన ఘట్టాల మెట్ల వరకు చేరుకుంది.
భద్రాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం - లోతట్టు ప్రాంతాల అప్రమత్తం - Bhadradri Water level Increased
Bhadradri Water level Increased : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం 24 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం ప్రస్తుతం 31.5కు చేరింది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు.
godavari_water_level_increased (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 20, 2024, 11:00 AM IST
గోదావరి ఎగువన ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి 66వేల 900 క్యూసెక్యుల వరద నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్య్సకారులను గోదావరి వైపు వెళ్లొద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశించారు. రాష్ట్రంలో దంచికొడుతున్న వానలు - ఉప్పొంగుతున్న వాగులు, వంకలు