Bank Fraud Case Accused ArrestIn Hyderabad : గర్తింపు కార్డులతో బ్యాంకుల నుంచి రుణం తీసుకొని మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపారు. అనంతరం న్యాయస్థానంలో కేసు విచారణకు వచ్చింది. జైలుశిక్ష తప్పదని అనుకున్న అతడు పోలీసుల నుంచి పారిపోయాడు. చిరునామా మార్చి పోలీసులను ఏమార్చాడు. ఎవరికీ దొరకనన్న ధైర్యంతో ఉన్న అతడిని జీ- మెయిల్ పోలీసులకు పట్టించింది.
పోలీసుల వివరాల ప్రకారం: యూసుఫ్‌గూడలో నివసిస్తున్న కె.ఎన్.రంజిత్‌రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు అడ్డదారులను ఎంచుకున్నాడు. 2016లో నకిలీ ఓటరు గుర్తింపు, పాన్‌కార్డులను సృష్టించి సికింద్రాబాద్ రాణిగంజ్‌లోని బ్యాంకు నుంచి రూ.50లక్షల రుణం తీసుకున్నాడు. అక్కడ తేలికగా రుణం రావడంతో వివిధ రకాల పేర్లు, నకిలీ గుర్తింపు కార్డులతో మరికొన్ని బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు పొందాడు.
మాయగాడిపై పక్కా సమాచారం అందుకున్న పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2016 జులై 30న అదుపులోకి తీసుకొని విచారించగా ఇతడి మోసాలు బయటపడ్డాయి. దీనిపై మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2021లో కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా శిక్ష తప్పదని భావించిన రంజిత్‌రెడ్డి కోర్టు ఆవరణలోని బాత్రూంకు వెళ్లి అటు నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి ఇతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.