ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏ తల్లి నేరమో ఇది!- చెత్తకుప్పల్లో పసికందుల మృతదేహాలు - Babies Dead Bodies at Garbage

Babies Dead Bodies at Garbage Heaps: అమ్మజాతికి మాయని మచ్చ తెచ్చే ఘటనలు పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో వెలుగులోకి వచ్చాయి. కాలువ గట్టు పక్కన, చెత్త కుండీల్లో పసికందుల మృతదేహాలు చూపరుల హృదయాలను గాయపరిచాయి. ఈ అమానవీయ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Babies_Dead_Bodies_at_Garbage_Heaps
Babies_Dead_Bodies_at_Garbage_Heaps (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 19, 2024, 11:02 PM IST

Updated : May 20, 2024, 2:24 PM IST

Babies Dead Bodies at Garbage Heaps:నగరం నడిబొడ్డున అమ్మతనం మంటగలిసిపోయింది. కాలువ గట్టు పక్కన, చెత్త కుండీల్లో పసికందుల మృతదేహాలు వెలుగు చూశాయి. మాతృత్వాన్ని మరచి కర్కశంగా ప్రవర్తించారు. నవ మాసాలు మోసి కూడా మానవత్వాన్ని మరిచిపోయారు. చేసిన చీకటి పాపం బజారున పడుతుందన్న భయమో లేక ఏ కామాంధుడి దాహానికి బలైన శాపమో తెలియదు గానీ నడి బజారులో అమ్మతనానికి మచ్చ తీసుకొచ్చారు.

ఇంటర్​ బాలిక ప్రసవం.. శిశువు మృతి.. పదో తరగతి విద్యార్థే..!

పేగు బంధం తెంచేసి పాలిథీన్ కవర్​లో చుట్టి నెలలు నిండని పసికందును కాలువ గట్టుపై ఓ తల్లి పడేస్తే, మరో మాతృమూర్తి పొత్తిళ్లలో శిశువును అట్ట పెట్టిలో పెట్టి చెత్త బుట్టలో పడేసింది. అమ్మ పొత్తిళ్లలోనే ప్రాణాలు పోయాయో లేక ప్రాణం ఉండగానే అమ్మ ఒడికి దూరమయ్యారో తెలియదు గానీ ఆ పసి ప్రాణాలు ఎవరి పాపానికో బలైపోయాయి. 'నేనేం పాపం చేశాను అని!' ఆ పసిబిడ్డల మృతదేహాలు ప్రతీ ఒక్కరిని కడు దయనీయంగా ప్రశ్నిస్తున్నాయి.

ఇంట్లోనే నార్మల్​ డెలివరీ కోసం భర్త పట్టు- రక్తస్రావంతో గర్భిణి, శిశువు మృతి

పార్వతీపురం మన్యం జిల్లాలో కొత్తవలసలో కాలువ గట్టుపై పడి ఉన్న శిశువు ఘటన వెలుగులోకి వస్తే, మరో ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. ఈ దయలేని లోకంలో దారుణ స్థితిలో పసికందుల మృతదేహాలను చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే:పార్వతీపురం మన్యం జిల్లాలో కొత్తవలసలో శివారులోని జంజావతి కాలువ గట్టు పక్కన పసికందు మృతదేహం కలకలం రేపింది. పక్కన నెలలు నిండని శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై జయంతి సిబ్బందితో వచ్చి పరిశీలించారు. పాలిథిన్ కవర్​లో చుట్టి ఉన్న పసికందు మృతదేహాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు సేకరించారు.

విజయనగరం మెయిన్ రోడ్డులో మనోహర్ షాప్​కి ఎదురుగా ఒక మున్సిపాలిటీ చెత్త కుండీలో శనివారం సాయంత్రం మరో శిశువు మృతదేహం కలకలం రేపింది. దారుణ స్థితిలో పసికందు మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

3నెలల చిన్నారికి 51 సార్లు వాతలు.. వ్యాధికి వింత చికిత్స.. శిశువు మృతి

Last Updated : May 20, 2024, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details