ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

ETV Bharat / state

ప్రత్యర్థులకు సాయం చేశాడని పట్టపగలు హత్యాయత్నం - అనంతపురం జిల్లాలో దారుణం - Opponents Attack Family in Guntakal

Opponents Attack on Family in Guntakal : గుంతకల్లులో పట్టపగలే ఓ కుటుంబంపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Opponents Attack on Family in Guntakal
Opponents Attack on Family in Guntakal (ETV Bharat)

Guntakal Attack Video Viral :మంచికి పోతే చెడు ఎదురైందనే మాట వింటూనే ఉంటాం. కొన్ని ఘటనలు చూసినప్పుడు ఇది నిజమేనని అనిపిస్తోంది. ఓ రెండు కుటుంబాల మధ్య ఓ విషయం గురించి వివాదం నడుస్తోంది. తనకు తెలిసినవారే కావడంతో ఓ వ్యక్తి అందులోని ఓ వర్గానికి సహాయం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇది నచ్చని ప్రత్యర్థి వర్గం ఆయన ఇంటిపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ నెల 20న ఇది జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

గుంతకల్లులోని విద్యానగర్ కాలనీలో రైల్వే సంక్షేమ విశ్రాంత ఉద్యోగి రవిశంకర్ నాయక్ నివాసం ఉంటున్నారు. తనకు తెలిసిన ఓ కుటుంబం వివాదంలో ఉండండతో ఆయన వారికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం ప్రత్యర్థి వర్గానికి నచ్చలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు రవిశంకర్​ ఇంటిపై వారు పట్టపగలే దాడికి పాల్పడ్డారు. మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. తమ ప్రత్యర్థులకు సాయం ఎలా చేస్తారని వారిని ప్రశ్నిస్తూ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Attack With Deadly Weapons Guntakal : ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్​లో రికార్డ్ కావడంతో వెలుగులోకి వచ్చాయి. తమపై వారు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఓ విషయం గురించి తమపై దాడి చేశారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించామని, సీసీ టీవీ దృశ్యాలను వారికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే పట్టపగలే మారణాయుధాలతో దాడి చేసిన వారిపై పోలీసులు సాధారణ కేసులు నమోదు చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Vizag: విశాఖలో మారణాయుధాలతో ‘హైపర్‌బాయ్స్‌’ వీరంగం

Conflict : ఇరువర్గాల ఘర్షణ... ఐదుగురు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details