తెలంగాణ

telangana

ETV Bharat / state

టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి నాణ్యతా లోపం లేదు : ఏఆర్‌ డెయిరీ - AR Dairy on TTD Laddu Controversy - AR DAIRY ON TTD LADDU CONTROVERSY

AR Diary about TTD Laddu : తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడుకు చెందిన ఏఆర్‌ డెయిరీ స్పందించింది. నాణ్యత పరీక్షల తర్వాతే నెయ్యి సరఫరా చేసినట్లు ఏఆర్‌ డెయిరీ వెల్లడించింది. సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి నాణ్యతా లోపం లేదని వ్యాఖ్యానించింది

AR DIARY ABOUT TTD LADDU GHEE
AR Diary about TTD Laddu (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 20, 2024, 4:58 PM IST

Updated : Sep 20, 2024, 6:46 PM IST

AR Diary about TTD Laddu Controversy : తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడుకు చెందిన ఏఆర్‌ డెయిరీ తాజాగా దీనిపై స్పందించింది. నాణ్యత పరీక్షల తర్వాతే నెయ్యి సరఫరా చేసినట్లు వెల్లడించింది. జూన్‌, జులైలోనే టీటీడీకి నెయ్యి సరఫరా చేశామని, ల్యాబ్‌ పరీక్షల తర్వాతే నెయ్యి సరఫరా అయినట్లు తెలిపింది. సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి నాణ్యతా లోపం లేదని స్పష్టం చేసింది.

Last Updated : Sep 20, 2024, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details