Apex Council Resignation in ACA General Meeting:రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏసీఏ అధ్యక్షుడు సహా ఇతరులు రాజీనామా అనివార్యమైంది. విజయవాడలోని ఓ హోటల్‌లో ఆంధ్ర క్రికెట్ అసోయేషన్ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ రాజీనామా చేసింది. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే పెన్మత్స విష్ణకుమార్‌రాజుతో పాటు వివిధ జిల్లాల నుంచి క్రికెట్ అసోయేషన్ సభ్యులు, వివిధ క్లబ్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.
2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీఏని తమ గుప్పెట్లో పెట్టుకుంది. 2022 నుంచి 2025 వరకు అపెక్స్ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్న వారంతా ఇప్పుడు రాజీనామాకు సిద్ధమయ్యారు. ప్రస్తుత అధ్యక్షులు పీ. శరత్‌చంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు పీ. రోహిత్‌రెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్. గోపీనాథ్‌రెడ్డి సహా ఇతరులు చేసిన రాజీనామాలను సర్వసభ్య సమావేశం ఆమోదించింది.
ఇంతవరకు ఎపెక్స్ కౌన్సిల్‌లో వారు చేసిన సేవలకు సర్వసభ్య సమావేశం ధన్యవాదాలు తెలిపింది. కొత్త అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుకు 35 నుంచి 40 రోజుల సమయం పడుతుందని అంచనా. ఎన్నిక నిర్వహణకు తేదీని సర్వసభ్య సమావేశం ఖరారు చేసింది. సెప్టెంబరు 8వ తేదీన సీనియర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పరిశీలకునిగా ఎన్నిక జరగనుంది. అంతవరకు ఏసీఏ సేవలకు అంతరాయం కలగకుండా ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. ఇందులో మాజీ మంత్రి కె. రంగారావుతోపాటు, మురళీమోహన్ సభ్యులు వ్యవహరిస్తారని సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు.
'మదనపల్లె ఫైళ్ల దహనం'లో కీలక మలుపు- వైఎస్సార్సీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసు - madanapalle fire accident case
2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకు జరిగిన ఎన్నికల్లో ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి అన్న, అరబిందో డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి ఏసీఏ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా సాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి, కార్యదర్శిగా సాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, విశాఖకు చెందిన వస్త్రవ్యాపారి గోపీనాథ్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. పేరుకే శరత్‌చంద్రారెడ్డి, రోహిత్‌రెడ్డి అధ్యక్ష, ఉపాధ్యక్షులు. ఏసీఏని గోపీనాథ్‌రెడ్డి తన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారు .
2022 నవంబరులో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడున్న అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఆ ఎన్నికల్లో ఒక్కో పోస్టుకు ఒక్కరే నామినేషన్ వేసేలా చేశారు. అంతవరకు విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఏసీఏని దాని పగ్గాలు సాయిరెడ్డి మనుషుల చేతుల్లోకి వెళ్లడంతో మాజీ సీఎం జగన్ మెప్పు కోసం విశాఖకు ఏసీఏ ప్రధాన కార్యాలయాన్ని మార్చేశారు. అక్రమాలకు ఏసీఏ అడ్డాగా మారిన తరుణంలో కొత్త ప్రభుత్వం త్వరలో రాబోయే కొత్త అపెక్స్ కౌన్సిల్ ఆంధ్రా క్రికెట్ అసోయేషన్‌లోని వివాదాలు-, అక్రమాలకు పుల్‌స్టాప్ వేయాలని క్రీడా సంఘాలు ఆశిస్తున్నాయి.
'జల్ జీవన్ మిషన్'పై పవన్ ఆరా- గత ప్రభుత్వ వ్యయాలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం - Pawan Review on Jal Jeevan Mission
జగన్ సర్కార్ నిర్లక్ష్యంతో కాలువలు పాయే, పంటల పోయో - YSRCP neglect maintenance of canals