AP TET 2024 Results : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Teacher Eligibility Test) ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్షకి సంబంధించిన ఫైనల్ కీని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో టెట్ ఫైనల్ కీని ఉంచారు. ఆక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలను పాఠశాల విద్యాశాఖ నిర్వహించింది. తొలి కీ విడుదల తర్వాత అభ్యర్థుల అభ్యంతరాలు తీసుకొని, అభ్యర్థుల అభ్యంతరాలు అన్నింటినీ పరిశీలించాకే తుది కీ విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు తెలిపారు. టెట్‌కు డీఎస్సీలో 20% వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే.
AP TET RESULT DATE : ఇక ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Andhra Pradesh TET 2024) ఫలితాలను పాఠశాల విద్యా శాఖ ప్రకటించనుంది. అధికారిక వెబ్‌సైట్‌లో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం (AP TET Schedule), ఏపీ టెట్ ఫలితాలు నవంబర్ 2వ తేదీన విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఫలితాలు విడుదలైన అనంతరం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://aptet.apcfss.in ని సందర్శించి, సంబంధిత వివరాలను ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.