ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజు వెడలే- నాలుగు జిల్లాల బస్సులన్నీ భీమిలీ వైపు కదిలే! సీఎం సభకోసం భారీగా బస్సులు- ప్రయాణికులకు తీవ్ర అవస్థలు - విశాఖ జిల్లా భీమిలి

AP People Facing Problems: ముఖ్యమంత్రి సభ ఉందంటే చాలు. ప్రజలు నానా అవస్థలు పడాల్సిందే అన్నట్లుగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయి. బలవంతంగా ప్రజలను సభలకు తరలించడం దగ్గర్నుంచి, బస్సుల తరలింపు వరకు ఇలా ఏదో సమస్యకు సామాన్యులు బలికావల్సి వస్తోంది. ఎన్నికల సిద్దం-యుద్దం అంటూ సీఎం జగన్ పూరించిన ఎన్నికల సమర శంఖారావం సభకు భారీగా బస్సులను తరలించడంతో ప్రయాణికుల కష్టాలు ఆ దేవుడికే ఎరుక అన్నట్లు దృశ్యాలు ఆవిష్కృతం అయ్యాయి.

ap_people_facing_problems
ap_people_facing_problems

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 10:12 PM IST

AP People Facing Problems: ప్రతిపక్షాలు అద్దె చెల్లిస్తామన్నా కదలని ఆర్టీసీ బస్సులు వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ సభ ఉందటే చాలు, డీపోలన్నీ ఖాళీ అవుతున్నాయి. భీమిలీలో వైఎస్సార్​సీపీ నిర్వహించిన సభ కారణంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోన్నారు. పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లోనూ బస్సులు లేక పడిగాపులు కాశారు. విశాఖలో విపక్షాలు, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

ముఖ్యమంత్రి జగన్ సభకు ఆర్టీసీ బస్సులు తరలించడంతో శ్రీకాకుళం ప్రయాణికులు నానాపాట్లు పడ్డారు. జిల్లాలోని నాలుగు డిపోల నుంచి 169 బస్సులను విశాఖ జిల్లా భీమిలిలోని సీఎం బహిరంగ సభకు తరలించారు. దీంతో ఉన్న బస్సులు సమయానికి రాక తీవ్ర ఇబ్బందులు పడ్డామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

'సిద్ధం' సభ పేరిట భీమిలికి జగన్ రాక - కొనసాగుతున్న అరెస్టులు, నిర్బంధాలు

"హైదరాబాద్​ నుంచి వచ్చాము. చాలాసేపు నుంచి వేచి చూస్తున్నాము. తిండి లేదు. ఏమీ లేదు. బస్సు వస్తుంది అంటున్నారు. రావడం లేదు." - ప్రయాణికురాలు

"ఎక్కడో మీటింగ్​ జరుగుతోంది. మరీ ఇక్కడ బస్సులు లేకపోతే ఎలా. ఎలా వెళ్లాలి. ఎలా రావాలి." - ప్రయాణికురాలు

సీఎం జగన్ చెప్పినా మాట వినని అసంతృప్త నేతలు - పెద్దిరెడ్డికి బాధ్యత అప్పగింత

ఉమ్మడి విజయనగం జిల్లా నుంచి 231 ఆర్టీసీ బస్సులను సీఎం సభకు కేటాయించారు. విజయనగరం, శృంగవరపుకోట, పార్వతీపురం, పాలకొండ, సాలూరు డిపోల నుంచి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. గ్రామీణ ప్రాంతాల బస్సులు లేకపోవటంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అనకాపల్లి జిల్లా పాడేరు నుంచి 22 ఆర్టీసీ బస్సులు తరలించడంతో ప్రయాణికుల కష్టాలు వర్ణాతీతం. ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆర్టీసీ బస్సుల మీదే ఆధారపడి ఉండడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ప్రైవేట్ వాహనాలలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోయారు.

గిరిజన ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించేందుకు చర్యలు: సీఎం జగన్

వైఎస్సార్​సీపీ భీమిలి సభ నేపథ్యంలో విపక్షాలు, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. టీఎన్​ఎస్​ఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, జన జాగృతి సమితి అధ్యక్షుడు వాసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌ను గృహ నిర్బంధం చేశారు. విశాఖలో భూదోపిడీలపై వైఎస్సార్​సీపీ పెద్దలను నిలదీసినందునే తనను నిర్బంధించారని మూర్తి యాదవ్ విమర్శించారు.

"విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణ త్యాగాలు చేసి విశాఖ ఉక్కును సాధించుకున్నారు. దీనిని ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టారు. ప్రైవేటికరణకు పూర్తిగా సహకరించిన వైఎస్సార్​సీపీని చిత్తు చిత్తుగా ఓడించాడానికి ఉత్తరాంధ్రులు సిద్ధంగా ఉన్నారు." - వాసు, జన జాగృతి సమితి

ఏం చేశారో చెప్పకుండా - విపక్షాలపై విమర్శలకే పరిమితమైన సీఎం జగన్​

ప్రతిపక్షాల సభలకు కదలని ప్రగతి రథాలు - పాలకపక్ష సమావేశాలకు పరుగులెడుతున్నాయి

ABOUT THE AUTHOR

...view details