AP Land Titling Act 2023 Debate: వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర దాకా వైఎస్సార్సీపీ నేతల భూదాహానికి అంతే లేకుండా పోయింది. ప్రైవేటు భూమి, ప్రభుత్వ భూమి అనే వివక్ష జగన్ మోహన్ రెడ్డి పార్టీ వాళ్లకి లేదు. కన్నుపడితే చాలు ఖర్చీఫ్ వేసేయటమే వారికి తెలిసింది. ఈసారి దాన్ని మరింత విస్తృతం చేయటం కోసం జగన్ సర్కార్ భూ యాజమాన్య హక్కుల చట్టం అనేది కొత్తగా తెచ్చింది.
అది కనుక అమల్లోకి వచ్చిందంటే జనం ఆస్తులు గోవిందా అనే భయం ప్రజల్లో వచ్చేసింది. మీకు తెలియకుండా రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. మీ భూమి పరులపాలు కావచ్చు. ఎవరో ఓ కాగితం ముక్క పడేస్తే మీ కష్జార్జితమో, పిత్రార్జితమో ఏదైనా వివాదంలో పడొచ్చు. ఏ క్షణమైనా మీ ఆదరువు మీది కాకుండా పోవచ్చు. చివరికి వారసత్వాన్ని కూడా తామే నిర్ణయిస్తామంటూ నాటి బ్రిటిష్ పాలనను తలపిస్తున్నారు ఈ పిల్లదొర. ఆంధ్రులారా పారాహుషార్!
అడ్డూ అదుపు లేని భూదోపిడీకి తెరతీసేలా జగన్ ప్రభుత్వం ఆ చట్టాన్ని రూపొందించింది. అందులోని ప్రమాదకర అంశాలేంటి? జగన్ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తే జరిగే పర్యవసానాలేంటి? అనే అంశంపై ఈటీవీ ఆంధప్రదేశ్ ప్రత్యేక లైవ్ డిబేట్ ఏర్పాటు చేసింది. ఆ చట్టంపై అవగాహన ఉన్న ప్రముఖులు తమ అభిప్రాయాలు వెల్లడించారు.
ఆంధ్రులారా తస్మాత్ జాగ్రత్త - ఇది జగన్ మార్కు దోపిడీ చట్టం - చూసుకోకుంటే మీ భూములు ఇక అంతే! - AP LAND TITLING ACT 2023
ఏపీ ల్యాండ్ టైటిల్ చట్ట రూపకల్పనలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా విషయాలు విస్మరించింది. నీతి ఆయోగ్ సూచించిన కీలక సూచనలు తుంగలో తొక్కింది. చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి ముందు అనుసరించాల్సిన అనేక విధానాలను పక్కనపెట్టింది. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి, ల్యాండ్ టైటిలింగ్ అప్పిలేట్ ఆఫీసర్లను నియమించకుండా 2023 అక్టోబర్ 31వ తేదీ నుంచి ఈ చట్టాన్ని హడావుడిగా అమల్లోకి తీసుకొస్తూ జీఓ ఇచ్చింది. ప్రభుత్వ హడావుడి చూస్తే, అసలు ఉద్దేశమేంటో ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. భూ యాజమాన్య హక్కులను తేల్చే అధికారాన్ని సివిల్ కోర్టుల పరిధి నుంచి తొలగించి, అధికారులకు అప్పగించినప్పుడే ప్రజల భూములకు ప్రమాదం పొంచి ఉందనే విషయం స్పష్టమైంది. సర్కార్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
టైటిలింగ్ చట్టం ప్రకారం ప్రజల స్థిరాస్తులపై చట్టబద్ధ హక్కులను నిర్ణయించే అధికారాన్ని అధికారుల చేతుల్లోపెట్టి, వాటిని కబ్జా చేయడానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇప్పటికే రీ సర్వేలు నిర్వహించి, విస్తీర్ణాన్ని కుదించించి. అంతే కాకుండా భూమి హక్కు పత్రాలు ఇవ్వడం మొదలెట్టారు. అవి జగన్ సొంత ఆస్తులన్నట్లు హద్దు రాళ్లపై, భూ హక్కు పత్రాలపై ఆయన ఫొటోను ముద్రిస్తున్నారు.
ఏ రాష్ట్రం కూడా ఇలాంటి చట్టాన్ని ఇప్పటి వరకు తీసుకురాలేదని, తామే ఫస్ట్ తీసుకొచ్చామని గొప్పలు చెప్పారు. కానీ ఆస్తులకు రక్షణ కల్పించే నెపంతో భక్షిస్తున్నారనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. సర్వేయర్లు విస్తీర్ణాలను తగ్గించి చూపడం వల్ల భూయజమానులు, రైతులు ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్న రికార్డులను కాదని, కొత్తగా ఇవేం తలనొప్పులు అంటూ మండిపడుతున్నారు. ఈ చట్టంపై అవగాహన ఉన్న ప్రముఖులు ఏం అన్నారో తెలుసుకునేందుకు పైన ఉన్న లింక్ క్లిక్ చేసి చూడండి.
అక్కడ కేసీఆర్ ఓటమికి అదే కారణం- ఇక్కడ ఆందోళనలో జగన్ అండ్ కో! - Land Titling Act