ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ - విచారణ రేపటికి వాయిదా - Jogi Ramesh Bail Petition Hearing - JOGI RAMESH BAIL PETITION HEARING

Jogi Ramesh Anticipatory Bail Petition Hearing: వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 10కి వాయిదా వేసింది. 2021లో చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి వ్యవహారంలో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

YSRCP Leader Jogi Ramesh Anticipatory Bail Petition Hearing
YSRCP Leader Jogi Ramesh Anticipatory Bail Petition Hearing (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 3:26 PM IST

YSRCP Leader Jogi Ramesh Anticipatory Bail Petition Hearing : గత ఐదేళ్లూ జగన్ మోహన్ రెడ్డి అధికార అండతో అరాచకాలకు తెగబడిన వైఎస్సార్సీపీ నేతలు ఇప్పుడు కేసుల భయంతో కోర్టుల నుంచి శరణు కోరుతున్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వరుసపెట్టి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. 2021లో ఉండవల్లిలోని నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన అనుచరులు రాళ్లతో దాడి చేశారు. ఈ వ్యవహారంలో తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్​ వేశారు. జోగి పిటీషన్​పై హైకోర్ట్ విచారణ జరిపింది .

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 10కి వాయిదా వేసింది. 2021లో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై జోగి రమేష్ రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనపై 143, 324, 506, 188, 269, 270, రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్లతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

తెదేపా అధినేత ఇంటిపై దాడి యత్నం... కర్రలు, రాళ్లతో టీడీపీ, వైసీపీ నేతల పరస్పర దాడులు

ABOUT THE AUTHOR

...view details