AP Govt Focuse Cell Phone Towers Arrangements in villages :మారుమూల గ్రామాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సెల్ సిగ్నల్స్ కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కొత్త సెల్ టవర్లను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇప్పటికీ కూడా కొండ వాలు, మారుమూల గిరిజన ప్రాంతావాసులు సెల్‌ఫోన్ సిగ్నల్ కోసం టవర్ వెతుక్కుంటూ పరుగులు పెట్టే పరిస్థితి ఉంది. వారికి ఊరట కలిగించేలా కూటమి ప్రభుత్వం 2,305 చోట్ల కొత్తగా 4జీ సెల్ టవర్లను ఏర్పాటు చేస్తోంది. వీటిలో ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి. బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) వీటిని ఏర్పాటు చేస్తోంది. కొన్ని సెల్ టవర్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేటు రంగ టెలికాం సంస్థలకూ ప్రభుత్వం అప్పగించింది. అలాగే 5జీ సేవలనూ అందుబాటులోకి తెచ్చేందుకు చంద్రన్న సర్కార్ చర్యలు చేపట్టనుంది.
గిరిజన ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించేందుకు చర్యలు: సీఎం జగన్
టవర్ల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు : రాష్ట్రంలోకొత్త టవర్ల ఏర్పాటుతో మారుమూల ప్రాంతాలకూ 4జీ నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాటి ద్వారా 5,423 మారుమూల గ్రామాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు వేగవంతమైన సెల్‌ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా 2,271 లొకేషన్లలో టవర్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను కూటమి ప్రభుత్వం డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్‌కు (DoT) స్వాధీనం చేసింది. మరో 34 లొకేషన్లలో స్థలాలను నెల రోజుల్లో అందించనట్లు సమాచారం.