ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓర్వకల్లులో డ్రోన్‌ హబ్‌ - మరి అక్కడే ఎందుకంటే?

డ్రోన్‌ రంగంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు - 12,500 మందికి ఉపాధి

Drone Hub in Orvakal
Drone Hub in Orvakal (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 17 hours ago

Drone Hub in Orvakal :ఓర్వకల్లులో డ్రోన్‌ హబ్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్‌కుమార్‌ తెలిపారు. ప్రత్యేక హబ్‌ ఏర్పాటుతో తయారీ పరిశ్రమలు, డ్రోన్‌ టెస్టింగ్‌ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అమరావతి డ్రోన్‌ సదస్సులో స్ట్రాటజిక్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ బిల్డింగ్‌ ఏపీ డ్రోన్‌ ఎకో సిస్టంపై కీలక పత్రాన్ని ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడారు.

శిక్షణ, సర్టిఫికేషన్, అసెంబ్లింగ్‌ యూనిట్లు, రిపేర్లు, నిర్వహణ సేవలు, డాస్‌ (డ్రోన్స్‌ యాజ్‌ ఎ సర్వీస్‌) ఎకోసిస్టం అభివృద్ధి చెందుతుందని సురేష్​కుమార్ వివరించారు. ఈ సదుపాయాలతో అంకుర పరిశ్రమలు పెరుగుతాయని చెప్పారు. ఏపీలో డ్రోన్‌ సంబంధిత వ్యాపారాలకు అవసరమైన అన్ని అనుమతులను సింగిల్‌ విండో విధానంలో ప్రభుత్వం అందిస్తుందని సురేష్​కుమార్​ వెల్లడించారు.

ఓర్వకల్లులో ఏర్పాటుతో ప్రయోజనాలివీ :

  • దగ్గరలో ఉన్న కర్నూలు విమానాశ్రయంలోని రన్‌వేను డ్రోన్ల పరిశీలనకు వినియోగించుకోవచ్చు.
  • డ్రోన్‌ తయారీ పరిశ్రమలకు అవసరమైన అనుబంధ కంపెనీల ఏర్పాటుకు 10,000ల ఎకరాల వరకు అందుబాటులో ఉంటుంది.
  • హైదరాబాద్‌- బెంగళూరు నగరాలకు దగ్గరగానూ ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేసే సంస్థలకు అనుమతులన్నీ ప్రభుత్వమే సమకూర్చుతుంది. ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించడం వల్ల డీజీసీఏ అనుమతులు అక్కర్లేదు.
  • ఏపీలో ఇతర ప్రాంతాల్లోనూ డ్రోన్‌ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులిస్తాం. అయితే అవసరమైన డీజీసీఏ, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అనుమతులు, ఇతర లైసెన్సులు వారే సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

అవకాశాలను అందిపుచ్చుకోవడానికే : డ్రోన్ల రంగంలో మన దేశ వాటా కేవలం 3 శాతమేనని సురేష్​కుమార్ పేర్కొన్నారు . దీన్ని కనీసం 20 శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తోందని చెప్పారు. ఇందులో రానున్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ఏపీ సర్కార్ విధానాలు రూపొందిస్తోందని తెలిపారు. డ్రోన్ల వినియోగానికి విస్తృత అవకాశాలున్న మ్యాపింగ్, సర్వే, వ్యవసాయం, ఫొటోగ్రఫీ, తనిఖీలు, నిఘా రంగాలను కీలకంగా భావిస్తోందని ఆయన చెప్పారు.

'విభిన్న రంగాలు, ప్రభుత్వ శాఖల్లో డ్రోన్ల వినియోగం, ప్రోత్సాహకాలు, కృత్రిమ మేధతో అనుసంధానం, తయారీ రంగాన్ని ప్రోత్సహించే వాణిజ్య విధానం వంటివి అందుబాటులోకి తేవడం. తద్వారా డ్రోన్‌ అనుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పించాలని యోచిస్తోంది. ఏపీలో డ్రోన్ల రంగం ద్వారా ఐదేళ్లలో రూ.6000ల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ రంగంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు 12,500 మందికి ఉపాధి కల్పించేలా ముసాయిదా డ్రోన్‌ పాలసీని ప్రకటించింది. దీనిపై భాగస్వామ్య పక్షాలు, నిపుణుల సూచనల ఆధారంగా మార్పులు చేసి నవంబరు నాటికి తుది పాలసీని తీసుకొస్తాం’ అని సురేష్​కుమార్ పేర్కొన్నారు.

ఆపత్కాలంలో డ్రోన్లదే కీరోల్ - ప్రజాభద్రతలోనూ సమర్థ వినియోగం

అమరావతి డ్రోన్​ షో అదుర్స్​ - ఐదు గిన్నిస్​ రికార్డులు

ABOUT THE AUTHOR

...view details