AP Government To Introduce New Liquor Brands :ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నాణ్యతతో పాటు తక్కువ ధరకే మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన సర్కార్, మందుబాబులకు మరిన్ని గుడ్ న్యూస్‌లు చెప్పింది. త్వరలోనే కొత్త మద్యం బ్రాండు అందుబాటులోకి తెస్తామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. అంతే కాకుండా మద్యం ధరల తగ్గింపుపై కమిటీ వేసినట్లు తెలిపారు.
వైసీపీ పాలనలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఎక్సైజ్ శాఖ అధికారులతో విశాఖలో సమీక్ష నిర్వహించిన ఆయన మద్యం నాణ్యత, తక్కువ ధరకు అందించే విధంగా కమిటీ వేశామని తెలిపారు. కొత్త బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సొంత ఆదాయం కోసమే ఆలోచించారని విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్నామని తెలిపారు.
అక్రమాలపై విచారణ : తెలంగాణ, ఏపీలో అమ్మకాలకు రూ.4 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల రూపాయలు తేడా వచ్చిందని, ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందని మంత్రి కొల్లు ప్రశ్నించారు. గత ప్రభుత్వ అరాచకాల మీద విచారణ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వైట్ పేపర్ విడుదల చేశామన్నా ఆయన కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడలేదని స్పష్టం చేశారు. మూడు వేల దుకాణాలకు, 90 వేల అప్లికేషన్స్ వచ్చాయని చెప్పిన ఆయన రూ.1800 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని వివరించారు.
వైరల్ వీడియో : నడిరోడ్డుపై ఏరులై పారిన మద్యం - బాటిళ్ల కోసం ఆశగా ఎదురుచూసిన జనం