PD Act On Social Media Misusers : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలతో హేయమైన దాడికి పాల్పడుతున్న సైకోలపై ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్(పీడీ) యాక్ట్ ప్రయోగానికి రంగం సిద్ధమవుతోంది. ఉచ్ఛనీచాలు మరచి, జుగుప్సాకర పదజాలంతో పేట్రేగుతున్న ఉన్మాద మూక ఇకపై సంవత్సరం దాకా జైల్లో మగ్గాల్సిందే. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం- 1986 (ప్రమాదకర కార్యకలాపాల నియంత్రణ చట్టం) సవరణ బిల్లు ఇటీవల శాసనసభలో ఆమోదం పొందింది. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే ఈ సవరణ చట్టం అమల్లోకి రానుంది.
విచారణకు హాజరు కాని సజ్జల భార్గవ్ రెడ్డి - వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసుల దర్యాప్తు వేగం
సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులతో ఎంతలా రెచ్చిపోయినా పోలీసులు ఏమీ చేయలేరనే భావనతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న వారికి ఈ చట్టంతో అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వారందరినీ పోలీసులు గుర్తించారు. వారిపై కేసులు పెట్టి, దర్యాప్తు చేస్తున్నారు. మానవ మృగాల్లా వ్యవహరించిన బోరుగడ్డ అనిల్, వర్రా రవీంద్రారెడ్డి వంటి అనేక మంది వివరాలతో జాబితాను సిద్ధం చేశారు. వీరిపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.
సొంత పార్టీ వారే కేసులు పెట్టి వేధించారు - వైఎస్సార్సీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా
AP Govt Focus on Obscene Posts : ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం- 1986 ప్రకారం. అక్రమ మద్యం, నాటుసారా తయారీ, సరఫరా, రవాణా, ఎగుమతి, దిగుమతి చేసేవారు, బందిపోటు దొంగతనాలకు పాల్పడే ముఠాలు, మత్తు పదార్థాల తయారీ, సరఫరా, విక్రయదారులు, మానవ అక్రమ రవాణాదారులు, భూకబ్జాదారులను నిర్బంధించేందుకు అవకాశముంది. తాజాగా తీసుకొచ్చిన సవరణ బిల్లులో మరో 8 రకాల నేరాలకు పాల్పడేవారిపైనా పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు వీలు కల్పించారు.