Government Focused On Removing ineligible Pension Holders : దీర్ఘకాలిక వ్యాధులతో పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకు 15 వేల రూపాయల పింఛన్ అందిస్తుండగా, లబ్ధిదారుల్లో చాలామంది ఆ పరిస్థితుల్లో లేరని స్పష్టమవుతోంది. వారి వాస్తవ పరిస్థితిని నిర్ధారించేందుకు కొద్దిరోజులుగా వైద్యులు టెస్టులు చేస్తున్నారు. అందులో కేవలం 20 నుంచి 30 శాతం మంది మాత్రమే నిజమైన అర్హులుగా తేలుతున్నారు. మరో 40 నుంచి 50% మంది వైకల్యంతో బాధ పడుతున్నప్పటికీ, వారు రూ.15000 పింఛన్‌కు అర్హులు కారని, వీరికి దివ్యాంగుల మాదిరిగా రూ.6000 పింఛన్‌కు మాత్రమే అర్హులని గుర్తిస్తున్నారు. మరో 25 నుంచి 30 శాతం మందిలో అసలు వైకల్యమే లేదని తెలింది. కొందరిలో ఉన్నా పెన్షన్ పొందేందుకు అర్హమైన స్థాయిలో లేదని బయటపడింది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంబంధిత అధికారులు రూ.15 వేల పింఛన్ పొందుతున్న 655 మంది ఇళ్లకు వైద్య బృందాలను పంపారు. వారికి నిర్ధారణ పరీక్షలు చేయించగా 374 మంది మాత్రమే అర్హులని తేలింది. మరో 255 మందికి దివ్యాంగుల కోటాలో రూ.6 వేల చొప్పున ఇవ్వొచ్చని నిర్ధరించారు. మరో 26 మంది అసలు ఏ ఆరోగ్య సమస్యా లేకున్నా నకిలీ ధ్రువపత్రాలతో పింఛన్లు పొందుతున్నట్లు వెల్లడైంది. గత వైఎస్సార్సీపీ హయాంలో భారీ ఎత్తున అనర్హుల పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.15 వేల చొప్పున పింఛన్ పొందుతున్న 24,091 మంది లబ్ధిదారుల ఇళ్లకు సోమవారం నుంచి వైద్య బృందాలు వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేస్తుండటంతో, ఈ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.
70 మందిని పరీక్షించగా, 50 మంది అనర్హులే :
- అనంతపురం జిల్లాలో 144 మందిని పరీక్షించగా అందులో 118 మంది ‘మంచానికి పరిమితం’ అయిన స్థితిలో లేరని వెల్లడైెంది. వీరిలో చాలామంది రూ.6 వేల పింఛన్‌కు అర్హులని తేలింది.
- ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో 3 రోజుల పాటు 80 మందిని సర్వే చేశారు. అందులో 20% మాత్రమే అర్హులని, మరో 20 శాతం పూర్తిగా అనర్హులని గుర్తించారు. అలాగే 60శాతం మందిని దివ్యాంగుల కోటలో చేర్చవచ్చని తేల్చారు.
- ప్రకాశం జిల్లాలో 70 మందిని పరిశీలించగా అందులో 50 మంది అనర్హులేనని నిర్ధారించారు.
వారిని కట్ చేస్తే కోట్లలో ఆదా :