ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో రహదారులపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ - 100 రోజుల యాక్షన్ ప్లాన్ - 100 Days Action Plan for Roads - 100 DAYS ACTION PLAN FOR ROADS

AP Government 100 Days Action Plan for Roads: ఏపీ వ్యాప్తంగా రోడ్లపై గతుకులు అనేవే లేకుండా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. ఇప్పటికే నిధులు మంజూరు చేసినందున, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.

AP Government 100 Days Action Plan for Roads
AP Government 100 Days Action Plan for Roads (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 4:49 PM IST

AP Government 100 Days Action Plan for Roads: ఏపీ వ్యాప్తంగా రహదార్లను గతుకులు లేకుండా తీర్చిదిద్దాలని రహదారులు భవనాల శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై సచివాలయంలో ఆయన ప్రభుత్వ కార్యదర్శులతో సమీక్షించారు. రహదారులు భవనాలు శాఖపై జరిగిన సమీక్షలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద అన్నిరహదార్లను గుంతలు లేకుండా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నిధులు మంజూరైనందున త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ప్రధాన రహదార్లపై గుంతలు గుర్తించేందుకు అవసరమైతే డ్రోన్లు వినియోగించాలని సూచించారు. పనులు పూర్తయ్యాక ఆయా ప్రాంతాల్లోని ఏఈ, డీఈఈ, ఈఈ, ఎస్​ఈల నుంచి గుంతలు లేవని సర్టిఫికెట్లు తీసుకోవాలని స్పష్టం చేశారు. టెండర్లు ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. టెండర్లు ఖరారు కాగానే గుంతలను పూడ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.

ఏపీలో కొత్త జాతీయ రహదారులపై చంద్రబాబు ఫోకస్ - ఇక పనులు స్పీడ్ అప్ - AP Govt Focus on National Highways

అంతకు ముందు విద్య, ఉన్నత విద్యాశాఖలకు సంబంధించి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద మధ్యాహ్న భోజన పధకం, ఎకడమిక్ క్యాలెండర్, నైపుణ్య శిక్షణ, వివిధ విద్యా సంస్థలకు రేటింగ్ ఇచ్చే ప్రక్రియ, ఐటీఐలు, పాలిటెక్నిక్​లను పరిశ్రమలతో అనుసంధానం చేసి ఇంటర్న్​షిప్, అప్రంటీస్​షిప్ కల్పించడం వంటి అంశాలపై చర్చించారు. మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 100 రోజుల కార్యాచరణపై చర్చిస్తూ ఇంకా ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్లు, డ్రైన్లను శుభ్రం చేయడం, అంగన్వాడీ కేంద్రాల ప్రారంభం అంశాలపై సమీక్షించారు.

అదే విధంగా పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి గ్రామ సచివాలయ వ్యవస్థ బలోపేతం, ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, ఘణ వ్యవర్ధాల నిర్వహణ వంటి అంశాలపై సీఎస్ సమీక్షించారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద లక్షా 25 వేల గృహాలను నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వర్చువల్​గా పాల్గొని చెప్పారు. అనంతరం పౌర సరఫరాలు, గిరిజన, మహిళా శిశు సంక్షేమ, యువజన సంక్షేమ శాఖలకు సంబంధించి 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆయా శాఖల కార్యదర్శులతో చర్చించారు.

అమరావతిలో మరో రెండు రాచబాటలు - సీఆర్​డీఏ తాజా ప్రతిపాదన - Amaravathi National Highways

ABOUT THE AUTHOR

...view details