ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకున్న పవన్ - అడుగడుగునా అభిమానుల ఘన స్వాగతం - Pawan Kalyan to visit Kondagattu

Pawan Kalyan to visit Kondagattu : జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలోని కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆలయానికి వచ్చిన పవన్​కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

Pawan Kalyan to visit Kondagattu temple
Pawan Kalyan to visit Kondagattu temple (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 2:22 PM IST

Pawan Kalyan to visit Kondagattu temple:ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఆలయానికి తరలివచ్చారు. పవన్‌ రాక నేపథ్యంలో జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అంతకుముందు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్ మాదాపూర్​లోని తన నివాసం నుంచి పవన్​ రోడ్డుమార్గంలో పయనమయ్యారు. బయల్దేరే ముందుకు తన నివాసం వద్దకు వచ్చిన అభిమానులకు పవన్ అభివాదం చేశారు. ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న పవన్ మొక్కు చెల్లించుకునేందుకు కొండగట్టుకు వెళ్లారు. గతంలో జనసేన అధ్యక్షుడి హోదాలో కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్, ఈసారి ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో రావడంతో కొండగట్టు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

తొలి 100 రోజులు పాలనాపరమైన విషయాలపై దృష్టి పెట్టాలి - ఎమ్మెల్యేలకు పవన్​ కల్యాణ్​ దిశానిర్దేశం - Pawan Kalyan Meet in JSP MLAs

ఘన స్వాగతం పలికిన అభిమానులు: పవన్​ కొండగట్టు అంజన్న దర్శనానికి వెళుతుండగా రాజీవ్ రహదారి పొడవునా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. రాజీవ్ రహదారిపై అడుగడుగునా పవన్ నినాదాలతో హోరెత్తింది. అంతకుముందు సిద్ధిపేటలో పవన్‌ను అభిమానులు గజమాలతో సన్మానించారు. అభిమానులందరికీ అభివాదం చేస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, జై తెలంగాణ జై హింద్ అంటూ ప్రతిచోట్ల నినాదాలు చేసి వాహన శ్రేణిని ముందుకు కదిలించారు.

భారీగా భద్రత ఏర్పాట్లు : పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో జగిత్యాల ఎస్పీ అశోక్‌ కుమార్‌ ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు ముందు వారాహి వాహనానికి పవన్‌ కల్యాణ్‌ ఇక్కడే పూజలు నిర్వహించి యాత్ర మొదలు పెట్టారు. అప్పుడు మొక్కుకున్న మొక్కులు తీర్చుకునేందుకు ఆయన కొండగట్టుకు వచ్చారు. పవన్‌ కల్యాణ్‌ వస్తున్న నేపథ్యంలో అభిమానులు భారీ స్థాయిలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కల్యాణ్ : ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని పవన్ కల్యాణ్ 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష పాటిస్తున్నారు. దీక్ష సమయంలో పవన్ కల్యాణ్ కేవలం పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటారు. మంగళవారం (జూన్‌ 25) నుంచి పవన్ ఈ దీక్ష పాటిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో కూడా పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష పాటించిన సంగతి తెలిసిందే.

గురుకుల పాఠశాలల ఒప్పంద ఉపాధ్యాయుల విజ్ఞప్తి - పవన్ కల్యాణ్​ భరోసా - pawan kalyan takes complaints

ABOUT THE AUTHOR

...view details