Irregularities in Jagananna Mega Layout : ఇళ్లు కాదు ఊళ్లు నిర్మిస్తున్నామంటూ ఊదరగొట్టిన వైెఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల నెత్తిన అప్పులు మిగిల్చింది. అస్మదీయుల దోపిడీకి ద్వారాలు తెరిచింది. లబ్ధిదారులకు నివాస స్థలాల కేటాయింపు మొదలు ఇళ్ల మంజూరు, గుత్తేదారుల ఎంపిక, అప్పగింత, బిల్లుల చెల్లింపు వరకు జరిగిన అక్రమాలన్నీ క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. స్వయానా మాజీ సీఎం జగన్ ఇలాఖాలో ఒక్క ఇంటి నిర్మాణాన్నీ పూర్తి చేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో జగనన్న మెగా లేఅవుట్‌లో జరిగిన అక్రమాలపై కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
రేపటి నుంచే ఉచితంగా ఇసుక- నదుల్లో తవ్వకాలు, రవాణాపై ప్రత్యేక నిఘా - Free Sand Distribution in AP
వైెఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో జగనన్న మెగా లేవుట్‌లో 8400 ఇళ్లను గత ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఇటీవల సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని, నకిలీ లబ్ధిదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు.
లబ్ధిదారుల జాబితాలో పేర్లున్నా వందల మంది ఆధార్ కార్డు వివరాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇళ్ల నిర్మాణం పునాదులకే పరిమితం కాగా రహదారులతో పాటు భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఈ పనులన్నీ అస్మదీయులకు దోచి పెట్టడానికే ముందస్తుగా చేపట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పులివెందుల మెగా లే అవుట్ లో ఇళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం 82 కోట్ల74 లక్షల 24 వేల రూపాయలను చెల్లించింది. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యూనిట్ విలువ లక్షా 80 వేల రూపాయలు కాగా మరో 35 వేలు లబ్ధిదారుని నుంచి వసూలు చేశారు.
బెయిల్పై తిరిగొచ్చి బాలికను హతమార్చాడు- ప్రేమోన్మాది ఘాతుకం - MINOR GIRL murder
ఒక్కో ఇంటి నిర్మాణానికి గుత్తేదారుకు ఐచ్ఛికం-3 కింద 2.15 లక్షల రూపాాయలు చెల్లించేలా ఒప్పందం జరిగింది. నిర్మాణాల పరిమాణం కన్నా అధికంగా గుత్తేదారులకు బిల్లులు చెల్లించినట్లు తెలుస్తోంది. టెండరు ప్రక్రియ, ఎలాంటి ఒప్పందం లేకుండా EMD, FAAC చెల్లింపు మినహాయింపుతో గుత్తేదారుతో మౌఖిక ఒప్పందాలు చేసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా గుత్తేదారు ఖాతాకు నేరుగా బిల్లులు చెల్లించే విధంగా ఉన్నతస్థాయిలో ఓ ప్రైవేటు బ్యాంకు ద్వారా ఏర్పాట్లు చేసుకున్నారు. లబ్ధిదారుతో సంబంధిత బ్యాంకులో ఖాతా తెరిపించి గుత్తేదారుకు ఆన్ లైన్ ద్వారా బిల్లులు బదిలీ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
జగనన్న మెగా లేఅవుట్ భూముల్లో కొన్ని ఇళ్లకు పునాదులూ వేయలేదు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. రాక్రీట్ సంస్థ అత్యధిక ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. సింహభాగం ఇళ్లు గోడల వరకే పరిమితం కాగా మూడోవంతు పునాదుల వరకే నిర్మాణాలు జరిగాయి. మూడేళ్ల కాలంలో ఒక్క ఇంటినీ పూర్తి చేయక పోగా బిల్లులు మాత్రం ఇనుము, సిమెంటు, ఇసుక కింద దాదాపు 60 కోట్ల రూపాయలు విడుదల చేశారు. గతంలో పునాదులు వరకు 53 వేల రూపాయల వరకు బిల్లులు చెల్లిస్తుండగా గుత్తేదారులకు లబ్ధి కలిగేలా 70 వేలకు పెంచారు. దీంతో చాలా మంది పునాదుల వరకు నిర్మాణాలు చేపట్టి బిల్లులు తీసుకుని వెళ్లిపోయారు. గుత్తే దారులకు దాదాపు 85 కోట్ల వరకు బిల్లులు చెల్లించగా మౌలిక సదుపాయాల కింద చేపట్టిన నిర్మాణాలకు మరో 100 కోట్లు వరకు వెచ్చించారు. దాదాపు 200 కోట్లు మేర వెచ్చించినా నిర్మాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
పులివెందుల జగనన్న మెగా లేఅవుట్‌లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన రాక్రీట్ సంస్థ 4,937 ఇళ్ల నిర్మాణాన్ని తలపెట్టగ ఇప్పటికీ ఒక్క ఇల్లూ నిర్మాణం పూర్తి చేయలేదు. బిల్లులు మాత్రం నిర్మాణం కన్నా అధిక మొత్తంలో పొందారు. ఇన్ని అక్రమాలు జరిగిన పులివెందుల ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం నిగ్గు తేల్చడానికి విచారణ కమిటీ వేసింది.
అమరావతి మహానగరికి ఓఆర్ఆర్ హారం- రాష్ట్రంలో ఇక భూములు బంగారం - Amravati Ring Road Project