CM Chandrababu Polavaram Tour :ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సోమవారం పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఏర్పాట్లను ఏలూరు జిల్లా ఉన్నతాధికారులు శనివారం పరిశీలించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ లు ఏర్పాట్లను సమీక్షించి ఆయా శాఖల సిబ్బందికి తగు సూచనలు చేశారు. పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సిబ్బందికి వివరించారు. హెలిపాడ్ నుంచి ప్రాజెక్ట్ పనుల ప్రాంతాల వరకు సీఎం వెళ్లే అవకాశమున్నచోట్ల వరకు సీఎం కాన్వాయ్ ట్రైన్ రన్‌ను అధికారులు నిర్వహించారు. ప్రాజెక్ట్ ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాట్లు చేసినట్లు కలెక్టరు, ఎస్పీలు తెలిపారు. అక్కడే ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూపొందించిన వర్క్ షెడ్యూల్‌ను సీఎం ప్రకటించనున్నారు.
Minister Nimmala RamaNaidu on Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్, హంద్రినీవతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాటర్ పాలసీలపై ఈ నెల 3న సీఎం చంద్రబాబు సమీక్షించారు. పోలవరం ప్రాజెక్ట్ పనులపై షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్, హంద్రినీవతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాటర్ పాలసీలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించి, అక్కడే షెడ్యూల్ విడుదల చేసేలా సన్నాహాలు చేయాలని సీఎం సూచించారని వివరించారు. షెడ్యూల్ ప్రకారం ఒక్క రోజు కూడా తేడా లేకుండా పనులు జరగాలని సీఎం ఆదేశించారని నిమ్మల అన్నారు. ఐదేళ్ల విధ్వంస పాలన నుంచి తిరిగి పోలవరం పనులను పునఃప్రారంభిస్తున్నామని మంత్రి వివరించారు.