ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీకి తగిన సాయం అందించండి - నిర్మలా సీతారామన్​కు చంద్రబాబు విన్నపం - Chandrababu Met Nirmala Sitharaman - CHANDRABABU MET NIRMALA SITHARAMAN

CM Chandrababu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది.కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. అలాగే త్వరలోనే కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తగిన సాయం అందేలా చూడాలని విన్నవించినట్లు సమాచారం.

CM Chandrababu Meet Nirmala Sitharaman
CM Chandrababu Meet Nirmala Sitharaman (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 12:14 PM IST

Updated : Jul 5, 2024, 2:22 PM IST

CMChandrababu Meet Nirmala Sitharaman : దిల్లీలో రెండో రోజూ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆమెకు నివేదించి ఏపీకి అండగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే త్వరలోనే కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తగిన సాయం అందేలా చూడాలని విన్నవించినట్లు సమాచారం. నిర్మలతో సుమారు గంటసేపు చంద్రబాబు చర్చించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎన్డీయే ఎంపీలతో కలిసి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు.

నిర్మలా సీతారామన్​కు చంద్రబాబు విన్నపం (ETV Bharat)

అంతకుముందే నీతి ఆయోగ్​ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో సీఎం భేటీ అయ్యారు. ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు.

రాజ్‌నాథ్‌ సింగ్‌తో చంద్రబాబు (ETV Bharat)
జేపీ నడ్డాతో చంద్రబాబు (ETV Bharat)

అలాగే కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అఠావలెతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఫిక్కీ ఛైర్మన్, ప్రతినిధులను కలుస్తారు. భారత్‌లో జపాన్ రాయబారితోనూ సీఎం చర్చలు జరుపుతారు. సాయంత్రం పర్యటన ముగించుకుని దిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వస్తారు.

వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం - ఆదుకోండి - మోదీకి చంద్రబాబు వినతి - CM Chandrababu met with PM Modi

Last Updated : Jul 5, 2024, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details