AP CM and Ministers On SC ST Classification: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ధర్మాసనం తీర్పును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణపై ముందడుగు వేసిన పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, సామాజిక న్యాయం గెలవాలి అనేదే తెలుగుదేశం సిద్ధాంతమని స్పష్టం చేశారు. అత్యంత నిరుపేదలకు ఫలాలు అందించేందుకు వర్గీకరణ ఉపయోగపడుతుందని వెల్లడించారు. దళితులు ఐక్యంగా ఉండి, అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఆర్థికంగా, సామాజికంగా వారి జీవితాల్లో వెలుగులు రావాలని పేర్కొన్నారు.
Minister Nara Lokesh: ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టు తీర్పును విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్వాగతించారు. 30 ఏళ్ల క్రితం సామాజిక న్యాయాన్ని అమలు చేసింది చంద్రబాబు అని గుర్తు చేశారు. రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా వర్గీకరణ అమలు చేయడం వలన అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. అన్ని సామాజిక వర్గాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఎజెండాగా లోకేశ్ పేర్కొన్నారు.
చంద్రబాబు తీసుకొచ్చిన చట్టం వల్లే న్యాయం బతికింది: మందకృష్ణ - Manda Krishna Special thanks to cbn
Home Minister Vangalapudi Anitha: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును హోంమంత్రి వంగలపూడి అనిత స్వాగతించారు. 30 ఏళ్ల క్రితం సామాజిక న్యాయాన్ని అమలు చేసింది చంద్రబాబు అని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం వల్ల పలువురికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామని, అన్ని సామాజిక వర్గాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి టీడీపీ ఎజెండా అని అనిత స్పష్టం చేశారు.