AP Assembly Election Results in Guntur District : గుంటూరు జిల్లాలో సైకిల్ స్పీడ్‌కు అడ్డే లేకుండా పోయింది. మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. ముఖ్యమంగా పల్నాడు పరిధిలో వైసీపీ అరాచకాలను ఎదురొడ్డి నిలిచిన తెలుగుదేశం కార్యకర్తల శ్రమకు ప్రజలు ఓట్ల రూపంలో పట్టం కట్టారు.
కడపలోనూ చేజారినట్టే! నాలుగు స్థానాల్లో టీడీపీ విజయం- జగన్ నియోజకవర్గమైనా దక్కేనా ?
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం కూటమి విజయం ఖాయమని తెలిసినా అందరి దృష్టి మాత్రం ఒక నియోజకవర్గంపై ఉంది . అదే గుంటూరు లోక్‌సభ పరిధిలోని మంగళగిరి నియోజకవర్గం. ఇక్కడ గెలుపు గురించి కాదు అందరి ఎదురుచూసింది మెజార్టీ ఎంత వస్తుందన్నదే అందరూ చర్చించుకున్న అంశం. ఎందుకంటే ఇక్కడ పోటీలో ఉన్నది తెలుగుదేశం డైనమిక్ లీడర్, యువనేత, ఆ పార్టీ ఆశాకిరణం నారా లోకేశ్. అందరూ ఊహించినట్లే లోకేశ్ దాదాపు లక్ష ఓట్ల మెజార్టీకి చేరువతున్నారు. బహుశా రాష్ష్రంలో అత్యధిక మెజార్టీ ఇదే అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 60వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
రాజధాని నియోజకవర్గం తాడికొండలోనూ తెలుగుదేశం అభ్యర్థి శ్రావణ్‌కుమార్ 40వేలకు పైగా మెజార్టీలో కొనసాగుతున్నారు. పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర సైతం దాదాపు 25వేలకు పైగా ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. ప్రత్తిపాడులో తెలుగుదేశం అభ్యర్థి బూర్ల రామాంజనేయులు 41,151 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గుంటూరు ఈస్ట్‌లో తెలుగుదేశం అభ్యర్థి 30వేల ఓట్ల మెజార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండగా గుంటూరు తూర్పు లో తెలుగుదేశం అభ్యర్థి గల్లా మాధవి భారీ మెజార్టీలో ఉన్నారు. తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ 47వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.