AP High Court orders On YSRCP Offices: నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనాల విషయంలో వివరణ ఇవ్వాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాలుచేస్తూ తొమ్మిది జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యాలు వేశారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ విచారణను గురువారానికి వాయిదా వేశారు. గురువారం వరకు కూల్చివేతల విషయంలో యథాతథ స్థితి పాటించాలని స్పష్టంచేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు తదుపరి విచారణ కొనసాగనుంది.
అనుమతి పొందకుండా నిర్మిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనాలను ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా నోటీసులు జారీచేశారు. వీటిని సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్లు వేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పి వీరారెడ్డి, న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. జాతీయ, గుర్తింపు పొందిన పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయించేందుకు 2016లో జీవో జారీచేశారన్నారు. అసెంబ్లీలో 50 శాతానికి మించి సంఖ్యాబలం ఉన్న పార్టీకి జిల్లా ప్రధాన కేంద్రంలో రెండెకరాలు కేటాయించవచ్చన్నారు.
అక్రమ వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటాం: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ - Daggupati Prasad on YSRCP Office
స్థలం కేటాయించాక ఏడాది లోపు కార్యాలయ నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. బిల్డింగ్ ప్లాన్ ఆమోదం కోసం చేసిన దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో అనుమతి ఇచ్చినట్లు భావించి నిర్మాణాలను కొనసాగించామన్నారు. నిర్మాణాలు జరపవచ్చని అధికారులు మౌఖికంగా తెలిపారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక కూల్చివేతలు చేపడుతున్నారన్నారు. కూల్చివేత అనేది చివరి అంశంగా ఉండాలన్నారు. ఏ క్షణానైనా కూల్చివేస్తారేమోనని పిటిషనర్లు ఆందోళన చెందుతున్నారన్నారు. స్టేటస్ కో ఉత్తర్వులు జారీచేయాలని కోరారు.
అప్పటివరకు స్టేటస్ కో పాటించాలని ఆదేశం:రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. అధికారులు చట్ట నిబంధనల ప్రకారం నడుచుకుంటారన్నారు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వొద్దని కోరారు. భవనాలను కూల్చే ఉద్దేశం ఉంటే నోటీసులు ఇచ్చి వివరణ ఎందుకు కోరతారన్నారు. పిటిషనర్లది ఆందోళన మాత్రమేనని పేర్కొన్నారు. వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని అన్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాల విషయంలో అధికారులు ముందుకెళ్లకుండా పిటిషనర్లు కోర్టు నుంచి ఉత్తర్వులు పొందాలనుకుంటున్నారని తెలిపారు. ఈ వ్యాజ్యాల్లో వివరాలు సమర్పించేందుకు స్వల్ప సమయం కావాలని కోరారు. దీంతో కేసు విచారణను నేటి వాయిదా వేసిన హైకోర్టు, అప్పటివరకు స్టేటస్ కో పాటించాలని ఆదేశించింది.
మా ఊరికి ఆ పేరేంటి - జగన్ ఫొటోలు తొలగించిన యువకులు - JaganMohanapuram Name Board Destroy