ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ వరి వంగడాన్ని తుపాన్ ఏం చేయలేదట - 150 రోజుల్లో పంట కోత - NEW RICE VARIETY

బీపీటీ సోనా 5204కు ప్రత్యామ్నాయంగా బీపీటీ-2846- కణేకల్లు విత్తనోత్పత్తి క్షేత్రంలో ప్రయోగాత్మకంగా సాగు

andhra_pradesh_government_releases_new_rice_variety
andhra_pradesh_government_releases_new_rice_variety (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 22 hours ago

Andhra Pradesh Government Releases New Rice Variety :రైతులకు లాభదాయకంగా ఉండేలా నూతన వరి వంగడాలను అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. గత 30 ఏళ్లుగా రైతులు సాగు చేస్తున్న బీపీటీ సోనా 5204కు ప్రత్యామ్నాయంగా తుపానులను తట్టుకునేలా బీపీటీ-2846 నూతన వరి వంగడాన్ని అభివృద్ధి చేసింది. రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లా కణేకల్లు వ్యవసాయ వరి విత్తనోత్పత్తి క్షేత్రంలో ఈ కొత్త రకాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేశారు. 150 రోజుల్లో పంట కోత దశకు చేరుకొనే నూతన వంగడం సాగు యాజమాన్య పద్ధతులను, ప్రయోజనాలను క్షేత్రం ఏడీఏ నారాయణనాయక్‌ వివరించారు.

ఏపీ సీడ్స్‌ గుంటూరు నుంచి కొత్త వంగడం బ్రీడర్‌ విత్తనాన్ని కొనుగోలు చేసిన క్షేత్రం అధికారులు ఖరీఫ్‌లో స్థానిక స్టేట్‌ సీడ్‌ మల్లిఫికేషన్‌ ఫామ్‌ ( State Seed Mullification Form)లో ఏడు ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. ముందుగా దుక్కి దున్ని సిద్ధం చేసిన నారుమడిలో ఎకరానికి 25 కిలోల చొప్పున విత్తనాన్నిజల్లి నారు పెంచారు. బీపీటీ సోనా తరహాలోనే 30 రోజుల వరినారు తొలగించి నాట్లు వేశారు. ఏడీఏ (ADA), ఏఈఓ (AEO) మణికంఠ పైరును నిరంతరం పర్యవేక్షిస్తూ సమగ్ర చర్యలు చేపట్టడంతో పైరు ఏపుగా పెరిగింది.

ఇది స్వర్గఫలం గురూ! ఒక్క పండు ధర 1500 - తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే మొట్టమొదటి సారి సాగు

బీపీటీ సోనా 5204 రకానికి భిన్నంగా కాండం లావుగా, దుబ్బ దృఢంగా పెరగడంతో తుపాను గాలులకు పైరు నేలవాలని తత్వాన్ని కలిగి ఉన్నట్లుగా గుర్తించినట్లు క్షేత్రం అధికారులు తెలిపారు. పొడవైన కంకులు, నిండుగా గింజలు రావడంతో ఆశాజనక దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పారు. పైరు ఎత్తుగా పెరిగినప్పటికీ ఇటీవల తుపాను ప్రభావానికి పంట నేలవాలకుండా నిలబడటంతో ప్రయోగాత్మక సాగులో సఫలమైనట్లుగా అధికారులు తెలిపారు.

రానున్న రోజుల్లో రైతులకు ఇది మేలు చేస్తుందని వచ్చిన దిగుబడులను బేరీజు వేసుకొని కొత్త రకం వంగడంపై అవగాహన కల్పిస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వచ్చే ఖరీఫ్‌కు కొత్తరకం వరి వంగడం అందుబాటులోకి తెచ్చి, సాగుకు రైతులను ప్రోత్సహించేలా వ్యవసాయశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

13 ఎకరాలు, 12 రకాల దేశీయ వంగడాలు - విజయనగరం రైతన్న విజయప్రస్థానం

ABOUT THE AUTHOR

...view details