AP Assembly Sessions Second Day Agenda: ఎన్నికల ముందు రద్దు చేస్తామని చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇప్పటికే నిర్ణయం తీసుకోంది. నేడు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అలాగే వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిన ఎన్టీఆర్ పేరును తిరిగి పునరుద్ధరించే బిల్లునూ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది. గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాల తీర్మానాన్ని కాలవ శ్రీనివాసులు ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సభ్యులు ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాల తీర్మానానికి సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పది ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. పాఠశాలల్లో నాడు - నేడు, కొత్త పాలిటెక్నిక్-ఐటీఐలు, వలంటీర్ల వ్యవస్థ, వీఆర్‌లో ఉన్న ఇన్‌స్పెక్టర్ల సమస్యలు, 2022-గ్రూప్-1 పోస్టుల ఇంటర్వూలపై ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నార. విశాఖ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ఎస్సీ సబ్ ప్లాన్, కేంద్ర పథకాలు, విభజన హామీలు, తుంగభద్ర హెచ్ఎల్ కెనాల్ మోడ్రనైజేషన్‌పై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి.
Council Agenda: శాసన మండలి సమావేశాల రెండో రోజు ప్రశ్నోత్తరాలు, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చించనున్నారు. ధన్యవాదాల తీర్మానంపై మండలిలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు చర్చను ప్రారంభించనున్నారు. పంచుమర్తి అనూరాధ తీర్మానాన్ని బలపరచనున్నారు. మండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పది ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. ఆర్థిక సంఘం గ్రాంట్ల మళ్లింపు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్ పథకం, జాతీయ రహదారి పనుల్లో అవకతవకలు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, టీటీడీలో అక్రమాలు, వైద్యారోగ్యం, పౌర సరఫరాల రుణాలు, ఫిషింగ్ హర్బర్లు, గనుల్లో అక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆరోగ్య శిబిరాలపై ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు.
అసెంబ్లీ నిర్వహణపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి స్పందన ఇదే - BAC Meeting on Assembly Management