ACA freed from YSRCP: జగన్ అధికారం, పలుకుబడిని అడ్డంపెట్టుకుని, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)ను గత ఐదేళ్లూ తన జేబు సంస్థగా మార్చుకున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సాయిరెడ్డి అల్లుడి అన్న, దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితుడు, అరబిందో డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి రెండు దఫాలుగా ఏసీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఉపాధ్యక్షుడిగా సాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి, కార్యదర్శిగా సాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడు, విశాఖకు చెందిన వస్త్రవ్యాపారి గోపీనాథ్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.
ఏసీఏ కోశాధికారిగానూ తన ఆడిటర్‌నే నియమించారు విజయసాయిరెడ్డి. పేరుకే శరత్‌చంద్రారెడ్డి, మోహిత్‌రెడ్డి అధ్యక్ష, ఉపాధ్యక్షులు. కానీ, ఏసీఏని నడిపించేంది గోపీనాథ్‌రెడ్డే. 2022 నవంబరులో ప్రస్తుత అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఆ ఎన్నికల్లో ఒక్కో పోస్టుకు ఒక్కరే నామినేషన్ వేసేలా ‘మేనేజ్’ చేశారు. 2019 ఎన్నికల ముందు వరకూ విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఏసీఏ కార్యాలయాన్ని జగన్ మెప్పుపొందేదుకు సాయిరెడ్డి తన మనుషుల ద్వారా విశాఖకు మార్చేశారు.
సాయిరెడ్డి కుటుంబ సభ్యుల పెత్తనం నుంచి ఏసీఏకు విముక్తి లభించనుంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో సాయిరెడ్డి బంధుగణంతో నిండిన ప్రస్తుత అపెక్స్ కౌన్సిల్ మొత్తం రాజీనామా చేయనుంది. ఈ నెల 21న జరిగే సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఆ తర్వాత ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటుచేసి కొత్త అపెక్స్ కౌన్సిల్ కోసం ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. ఇదంతా జరగడానికి 40 రోజుల సమయం పడుతుందని అంచనా. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఏసీఏ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉంది. జిల్లా క్రికెట్ సంఘాలు, వివిధ క్లబ్‌లు ఆయన అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
క్రికెటర్లు కూడా రాష్ట్రం నుంచి పారిపోవాల్సిందేనా? - వైసీపీ దెబ్బకు హనుమ విహారి ఔట్