ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సినిమా స్టైల్లో మర్డర్ - కుమార్తెను కిడ్నాప్ చేశాడనే అనుమానంతో హనీట్రాప్ హత్య - COUPLE KILLED AUTO DRIVER

హైదరాబాద్‌లో సినిమాను తలపించేలా ఆటో డ్రైవర్ హత్య - భార్యతో కలిసి స్నాప్‌ చాట్ ద్వారా ఆటో డ్రైవర్‌కు హనీట్రాప్

COUPLE KILLED AUTO DRIVER
COUPLE KILLED AUTO DRIVER (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2024, 12:45 PM IST

Updated : Dec 22, 2024, 1:13 PM IST

COUPLE KILLED AUTO DRIVER: హైదరాబాద్​లో సినిమాను తలపించేలా ఆటో డ్రైవర్‌ను హత్య చేసిన దంపతులను అరెస్టు అయ్యారు. కుమార్తెను కిడ్నాప్‌ చేశాడనే అనుమానంతో ఆటోడ్రైవర్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు భార్యతో కలిసి స్నాప్‌ చాట్‌ ద్వారా హనీట్రాప్‌ విసిరాడు. అనంతరం దంపతులిద్దరూ అతడికి బండరాయిని కట్టి సాగర్‌ కాలువలో పడేశాడు. 2023 మార్చిలో డ్రైవర్‌ అదృశ్యమవగా తాజాగా ఈ కేసును పోలీసులు ఛేదించారు.

ఇదీ జరిగింది:కుమార్తెపై ప్రేమ ఆ తల్లిదండ్రులను హంతకులను చేసింది. ఒక్కగానొక్క కుమార్తెను మాయమాటలతో అపహరించుకెళ్లిన యువకుడిని తల్లిదండ్రులు హతమార్చారు. హైదరాబాద్‌లోని నిజాంపేట్‌కు చెందిన కుమార్ (30) ఆటో నడిపేవాడు. ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్‌ జిల్లా మైలవరానికి చెందిన ఓ కారు డ్రైవర్ తన భార్య, కుమార్తెతో కలిసి జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నాడు. 7వ తరగతి చదువుతున్న కారు డ్రైవర్ కుమార్తెను గత సంవత్సరం ఆటో డ్రైవర్ తీసుకెళ్లి యూసఫ్‌గూడలోని ఓ గదిలో బంధించాడు. లైంగికదాడికి యత్నించగా ఆమె అక్కడ నుంచి తప్పించుకొని వెళ్లిపోయింది. బాలానగర్ పోలీసులకు కనిపించిన ఆమెను విచారిస్తే తాను అనాథనని చెప్పడంతో వారు ప్రత్యేక శిబిరానికి తరలించారు. మరోవైపు తమ కుమార్తె కోసం ఎంత వెతికినా వారికి ఆచూకీ దొరకలేదు. కొవిడ్ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసుల కోసం కొన్న లాప్‌టాప్‌ను తల్లిదండ్రులు పరిశీలించారు. స్నాప్‌ చాట్‌లో ఓ ఫోన్ నంబర్‌ను గుర్తించగా, అది ఆటో డ్రైవర్ కుమార్‌దని తెలిసింది.

బండరాయిని కట్టి సాగర్‌ కాల్వలో పడేశారు:ఆటో డ్రైవర్కుమార్ తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఆ తల్లిదండ్రులు అనుమానించారు. దీంతో బాలిక తల్లి స్నాప్‌చాట్‌ ద్వారా హనీట్రాప్ చేసి అతడిని మియాపూర్ రప్పించింది. అక్కడ బాలిక తల్లిదండ్రులు అతడిపై దాడి చేసి కారులో కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తమ కుమార్తె గురించి చెప్పాలని ప్రశ్నించారు. తన నుంచి బాలిక తప్పించుకుపోయిందని మృతుడు కుమార్ చెప్పడంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయి, దాడి చేశారు. ఆ దెబ్బలకు తాళలేక ఆటో డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో దంపతులు ఇద్దరూ అతడిని సూర్యాపేట వైపు తీసుకెళ్లి పెద్ద బండరాయిని కాళ్లు, చేతులకు కట్టి, బతికుండగానే నాగార్జున సాగర్ కాల్వలోకి పడేశారు. దీంతో ఆటో డ్రైవర్ కుమార్‌ మృతిచెందాడు.

ఈ క్రమంలో బొరబండ పోలీసు స్టేషన్‌ల్‌లో 2023 మార్చిలో ఆటో డ్రైవర్ అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. అనంతరం కారు డ్రైవర్ కుమార్తె వారి వద్దకు చేరుకుంది. దీంతో పాటు కుమార్ ఆటోను కారు డ్రైవర్ వాడుతుండగా దీనిని అతడి బంధువులు గుర్తించారు. దీనిపై వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసులో కీలక క్లూ దొరికినట్లైంది. ఆటో డ్రైవర్ హత్యలో బాలిక తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కువైట్‌ నుంచి వచ్చి చంపేశాడు - వీడియోతో వెలుగులోకి - ఆ తర్వాత ఏమైందంటే?

తల్లిదండ్రులను హతమార్చిన తపాలా ఉద్యోగి - బాపట్ల జిల్లాలో దారుణం

Last Updated : Dec 22, 2024, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details