Amaravati Farmers Comments on YSRCP Government : ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా అని మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనకు కేంద్ర బిందువుగా ఉండే రాష్ట్ర సచివాలయాన్ని జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టడం అత్యంత దారుణమని మండిపడ్డారు. అసలు రాజ్యాంగమే తెలియని వ్యక్తి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకోవచ్చని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా అని ప్రశ్నిస్తున్నారు.
రాజ్యాంగమే తెలియని వ్యక్తి రాజ్యాంగం గురించి మాట్లాడటం హాస్యాస్పదం: అమరావతి రైతులు జగన్ దా'రుణం' - రాష్ట్ర సచివాలయం తాకట్టు! అప్పుకోసం ఇంతలా దిగజారాలా
AP Secretariat Mortgage :అమరావతిపై విషం కక్కే సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర సచివాలయాన్ని ఎలా తాకట్టు పెడతారని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ఈ అయిదు సంవత్సరాల్లో ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వద్ద తాకట్టు పెట్టగా వచ్చిన రూ.370 కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఖర్చు చేయడానికి వినియోగిస్తారా? అని రైతులు ఆరోపించారు.
అమరావతి భ్రమరావతి అనే జగన్- సచివాలయాన్ని ఎలా తాకట్టు పెట్టారు- రాజధాని రైతుల ఆగ్రహం
Amaravati Farmers :అధికార నేతలు రాష్ట్రంలో ఉన్న ప్రకృతి వనరులన్నీ దోచేశారని అమరావతి రైతులు ఆరోపించారు. పచ్చగా ఉన్న అమరావతిని శ్మశానం, ఎడారిగా మార్చారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని లూటీ చేసి తాడేపల్లిగూడెంలో బటన్ నొక్కి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఒక చేత్తో రూ. 10 ఇచ్చి మరోవైపు పన్నులు, విద్యుత్ చార్జీ పేరుతో ప్రజల నుంచి రూ. 100 లాక్కుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు వైసీపీ పాలనపై పూర్తి అవగాహన వచ్చిందని, జగన్ చెప్పే మాయ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు.
సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటి ? - చంద్రబాబు భావోద్వేగ ట్వీట్
సీఎం జగన్ మాటలు మరోసారి నమ్మడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని అమరావతి రైతులు పేర్కొన్నారు. ఎన్నికలు రావడానికి ఇంకా 40 రోజుల సమయం మాత్రమే ఉందని పేర్కొన్నారు. విశాఖ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి ముఖ్యమంత్రిగా అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని కలలు కంటున్నారని, ఇప్పటికైనా వాస్తవంలోకి రావాలని సూచించారు.రాష్ట్రాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయని సీఎం జగన్, కొడాలి నానిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.