Allu Arjun thanked AP Govt For increasing ticket prices:'పుష్ప2' టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారిక జీవో విడుదల చేసింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'పుష్ప2: ది రూల్' (Pushpa 2 The Rule). ఈ చిత్రం డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
షోల వివరాలు ఇవే: డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్ ధరను రూ.800గా నిర్ణయించారు. ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే టిక్కెట్ రేటు రూ.800+GST చెల్లించాల్సిందే. చిత్రం విడుదలయ్యే రోజు డిసెంబర్ 5న తేదీన 6 షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాస్ రూ.100, అప్పర్ క్లాస్ రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200, పెంచారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 5 షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబరు 17 వరకూ పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయి.