All Parties Election Campaign in Various Districts :గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీ నేతలు ప్రచారాల జోరు రోజురోజుకు పెంచుతున్నారు. వేసవిని సైతం లెక్కచేయకుండా ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో నేతలు నిమగ్నమవుతున్నారు. ఉమ్మడి విజయనగం జిల్లాలో తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్సీపీ అభ్యర్థులు ప్రచార జోరు పోటాపోటీగా సాగుతోంది. ఎస్ కోట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి లలిత కుమారితో కలిసి విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన 100 మందికి భరత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.
కుప్పంలో జోరుగా టీడీపీ ప్రచారం - బాబును లక్షఓట్ల మెజార్టీతో గెలిపిస్తామంటున్న శ్రేణులు
Vijayanagaram: విజయనగరం అభ్యర్థి విజయలక్ష్మి గజపతిరాజు తెలుగు యువతతో సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గజపతినగరం వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య కలిసి దత్తిరాజేరు మండలం దత్తిలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు. బొబ్బిలిలో టీడీపీ అభ్యర్థి బేబినాయన కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి శంబంగి, చిన్నఅప్పలనాయుడుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. రాజాం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళి, బుచ్చింపేటలో పర్యటించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి తలేరాజేష్ నియోజకవర్గంలోని వాడ వాడా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన అభ్యర్థి సంధ్యారాణి పూసపాటిరేగ మండలంలో విజయయాత్ర నిర్వహించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ సురేష్ బాబుతో కలిసి ఎల్.పి.పాలెంలో ప్రచారం చేశారు.