దిల్లీ మద్యం కేసులో వైఎస్ భారతి రెడ్డి హస్తం- ఆదినారాయణరెడ్డి హాట్‌కామెంట్స్ (ETV BHARAT) Adinarayana Reddy Sensational Comments :రాష్ట్రంలో వైఎస్ భారతి రెడ్డి రాజ్యాంగం ప్రకారం పాలన కొనసాగిందని మాజీ మంత్రి, జమ్మలమడుగు శాసనసభ్యుడు చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి అన్నారు. దిల్లీ మద్యం కుంభకోణంలో భారతి రెడ్డి ప్రమేయం కూడా త్వరలో బయటకొస్తుందన్నారు. జగన్ కేసులపై విచారణ వేగవంతం కానుందని పేర్కొన్నారు. జమ్మలమడుగు నుంచి కూటమి అభ్యర్ధిగా గెలుపొందిన తర్వాత, తొలిసారి విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు.
రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి- చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్ - cm revanth phone call to cbn
వైఎస్సార్సీపీ నేతల సంప్రదింపులు : 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో బీజేపీ బలం పెరిగిందని చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తే ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలు గెలుపొందిందని పేర్కొన్నారు. ఆరు ఎంపీ స్థానాలకు మూడు చోట్ల విజయం సాధించారని ఆనందం వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముద్దాయిగా ఉన్నారని, త్వరలో అతనిపైనా చర్యలు ఉంటాయని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. బీజేపీలో చేరేందుకు ఇప్పటికే చాలా మంది వైఎస్సార్సీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. అయితే, రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగించిన వారి విషయంలో బీజేపీ అధిష్ఠానం సైతం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుందని ఆదినారాయణరెడ్డి వెల్లడించారు.
వైఎస్సార్సీపీ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది: గత ఐదు సంవత్సరాలుగా వైఎస్సార్సీపీ అక్రమాలతో విసిగిపోయిన ప్రజలు, రాష్టానికి మంచి జరగాలని కూటమికి మద్దతు తెలియచేశారని అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అరాచక పాలనకి ప్రజలు తమ ఓటుతో స్వస్తి పలికారని వెల్లడించారు. పుష్ప సినిమా మాదిరిగా జగన్ నేతృత్వంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ చేయించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చింది మెుదలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు.
గ్రామీణ ఉపాధిని తుంగలో తొక్కారని ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రజల ఆకాంక్ష అయిన విశాఖ రైల్వే జోన్‌కు కావాలనే స్థలం ఇవ్వలేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలు అభివృద్ధికి అనేక విధాలుగా అవరోధాలు సృష్టంచారన్నారని ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. వారం రోజుల్లోపే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే లు జంపింగ్‌కి సిద్ధం అవుతున్నారని ఆదినారాయణరెడ్డి వెల్లడించారు.
చంద్రబాబుకు అభినందనలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ - థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చిన సీబీఎన్ - Chandrababu Reply to Jr NTR Post
చంద్రబాబుకు మోదీ, అమిత్‌షా శుభాకాంక్షలు - CBN PHONE TO MODI AND AMIT SHAH