ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సొంతలాభం కోసం ప్రజలపై భారాన్నీ లెక్కచేయని జగన్‌

అదానీ నుంచి 1,750 కోట్ల రూపాయల లంచం - సెకితో ఒప్పందం వ్యవహారంలో అదానీ నుంచి భారీగా ముడుపులు

ys_jagan_in_adani_bribe_case
ys jagan in adani bribe case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2024, 7:02 AM IST

Adani bribe to YS Jagan Mohan Reddy: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ సెకి నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తును తీసుకోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు తద్వారా ప్రజలపై 1.10 లక్షల కోట్లు అదనపు భారం పడనుంది. ఈ విషయం తెలిసినా జగన్‌ సర్కార్ పట్టించుకోకుండా ఒప్పందం విషయంలో ముందుకే వెళ్లింది. సెకి నుంచి ప్రతిపాదన వచ్చిన తరువాత రోజే, ఎటువంటి పరిశీలన లేకుండానే ప్రతిపాదనను మంత్రివర్గ ఆమోదానికి పెట్టింది. తర్వాత గుట్టుగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై భారీ ఎత్తున ఆరోపణలు వచ్చినా జగన్‌ సర్కార్ పట్టించుకోలేదు. రైతుల మీద తనకే ప్రేమ ఉన్నట్లు, రానున్న 30 ఏళ్లపాటు అన్నదాతలకు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వడానికే ప్రభుత్వం ఈ భారాన్ని భరిస్తుందంటూ తీయని మాటలు చెప్పుకొచ్చారు.

సెకితో ఒప్పందం వ్యవహారంలో అప్పటి సీఎం జగన్‌ ముందుకు వెళ్లడానికి 17 వందల 50 కోట్లు అదానీ నుంచి ముడుపులు అందడమే కారణమని తాజాగా బహిర్గతమైంది. ప్రజల సంక్షేమం కంటే తన సొంత లాభానికే ప్రాధాన్యమిచ్చే జగన్‌ నైజంలో ఎటువంటి మార్పూ రాలేదని ఇప్పుడు మరోసారి నిరూపితమైంది.

సెకి నుంచి ఒక యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలుకు 2.49 రూపాయల చొప్పున చౌకగా కొంటున్నట్లు జగన్‌ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. కానీ, జనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సెస్‌ ఛార్జీలు, ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్ల నుంచి విద్యుత్‌ తీసుకోవడం వల్ల రాష్ట్రానికి కలిగే నష్టాన్ని సర్కార్ బయటపెట్టలేదు. అన్నీ కలిపితే యూనిట్‌కు 5.73 రూపాయల చొప్పున సెకి నుంచి తీసుకునే విద్యుత్‌కు వెచ్చించాలి. ఈ ప్రకారం 25 ఏళ్లలో ప్రజలపై లక్షా 10 వేల 160 కోట్లు భారం పడుతుంది. సెకి ఒప్పందం వల్ల రానున్న 25 సంవత్సరాలలో సుమారు 1.08 లక్షల కోట్ల భారం ప్రజలపై పడే అవకాశం ఉందని ఇంధనశాఖ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

అదానీ లంచం కేసు - వైఎస్సార్సీపీ సర్కార్​కు భారీగా ముడుపులు

ఆ విషయాన్ని గుట్టుగా ఉంచిన గత ప్రభుత్వం: సెకితో ఒప్పందం కుదుర్చుకునే నాటికి బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తు యూనిట్‌కు రూపాయి 99 పైసలు చొప్పున దొరుకుతోంది. కానీ, యూనిట్‌కు 50 పైసల చొప్పున అదనంగా చెల్లించేలా ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకుంది. సాధారణ పరిస్థితుల్లో సౌరవిద్యుత్‌ ప్రాజెక్టు నుంచి మెగావాట్‌కు ఏడాదికి 2 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఈ లెక్కన మెగావాట్‌కు అదనంగా 10 లక్షల చొప్పున సెకి నుంచి తీసుకునే 7 వేల మెగావాట్లకు సంవత్సరానికి 700 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈ ప్రకారం పీపీఏ అమల్లో ఉండే 25 ఏళ్లలో అదనంగా 17 వేల 500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోనే సౌర ప్రాజెక్టులు ఏర్పాటుచేస్తే అంతర్రాష్ట విద్యుత్‌ సరఫరా నష్టాల భారం సుమారు 3% తగ్గేది. ఈ విషయాన్ని గత ప్రభుత్వం గుట్టుగా ఉంచింది.

రాష్ట్రంలోని సౌర విద్యుత్‌ పార్కుల్లో ప్లాంట్లు ఏర్పాటుచేసే సంస్థలు మెగావాట్‌కు 42 లక్షల చొప్పున ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు (APSPCL) చెల్లించాలి. ఈ మొత్తం యూనిట్‌కు సగటున 30 పైసలు అవుతుంది. సౌర ప్రాజెక్టుల ఏర్పాటుకు చేసే ఖర్చుపై జీఎస్టీ రూపంలో రాష్ట్ర వాటా 7% వస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం వల్ల మెగావాట్‌కు 24 లక్షల చొప్పున యూనిట్‌కు సగటున 17 పైసలు చొప్పున నష్టం వాటిల్లుతుంది. ప్రజలపై పడే అదనపు భారం ప్రభుత్వ ఆదాయానికి వచ్చే నష్టంతో కలిపి యూనిట్‌కు 3.24 రూపాయల చొప్పున అవుతుంది. ఒప్పందం ప్రకారం మొదటి సంవత్సరం 3 వేల మెగావాట్ల విద్యుత్‌ని సెకి అందిస్తుంది. రెండో ఏడాది 3 వేల మెగావాట్లు, మూడో ఏడాది ఇచ్చే వెయ్యి మెగావాట్లతో కలిపి మొత్తం 7 వేల మెగావాట్లకు 4వేల 536 కోట్లు అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన 22 ఏళ్లలో 99వేల 792 కోట్ల అదనపు ఛార్జీల భారం పడుతుంది.

జగన్ మెడకు అదానీ స్కామ్ - చేతులు మారిన రూ.1750 కోట్లు - అమెరికా కోర్టు ఆరోపణ

ఆ మర్నాడే మంత్రివర్గం ఆమోదముద్ర:సౌరవిద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లను పలు కారణాలతో రద్దు చేయాల్సి వచ్చిందని, అందులో వివిధ సంస్థలు దాఖలు చేసిన బిడ్‌ల ధరకే 7 వేల మెగావాట్ల విద్యుత్‌ ఇస్తామంటూ సెకి 2021 సెప్టెంబరు 15న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దానిపై మరో ఆలోచన లేకుండా ఆ మర్నాడే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అదే సెకి సంస్థతో ఆల్‌జొమాయ్‌ ఎనర్జీ, వాటర్‌ కంపెనీ యూనిట్‌ 2 రూపాయల చొప్పున సౌర విద్యుత్‌ సరఫరా చేసేందుకు 2020 నవంబరులో ఒప్పందం చేసుకుంది. కానీ, జగన్‌ ప్రభుత్వం మాత్రం యూనిట్‌కు 2రూపాయల 49 పైసల చొప్పున చెల్లించేలా డిస్కంలు, రాష్ట్ర ప్రభుత్వం, సెకి సాధారణ ఎన్నికలకు ముందు 2024 ఏప్రిల్‌ 14న త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఏపీఈఆర్‌సీ అనుమతించింది.

సెకి విద్యుత్‌ కోసం కేంద్ర ప్రభుత్వం రైతులకు రాయితీపై ఇచ్చే పీఎం కుసుమ్‌ పథకాన్ని కూడా జగన్‌ సర్కార్ నిలిపేసింది. పీఎం కుసుమ్‌ పథకం కింద సౌర విద్యుత్‌ మోటార్లు పొందే రైతులు ఒక్కొక్కరు 15 వేల నుంచి 25 వేలు భరించాల్సి ఉంటుందని, పంపుసెట్ల నిర్వహణలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పథకాన్ని అమలు చేయలేదని ఇంధన శాఖ ద్వారా ప్రభుత్వం ప్రకటన ఇప్పించింది. ఈ పథకంలో చేరాలని ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించిందని అయితే, సెకి నుంచి తీసుకోనున్న 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను 30 సంవత్సరాల పాటు రైతులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడంతో సౌర విద్యుత్‌ మోటార్లు అవసరం లేదని పేర్కొంది.

ప్రజలపై తీవ్ర భారం: సెకితో కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందం వల్ల ఏటా 3వేల60 కోట్లు అదా అవుతుందని 2021 అక్టోబరు 19న ఇంధన శాఖ ద్వారా ప్రభుత్వం ప్రకటన చేయించడం విడ్డూరం అనిపిస్తుంది. ఒప్పందం ప్రకారం సెకి నుంచి ఏటా 17 వందల కోట్ల యూనిట్ల చొప్పున 25 ఏళ్లలో 42వేల500 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ప్రభుత్వం తీసుకోనుంది. పీపీఏ ప్రకారం యూనిట్‌కు రెండున్నర రూపాయల చొప్పున 25 ఏళ్లలో విద్యుత్‌ కొనుగోలుకు చేసే ఖర్చు లక్షా 5 వేల 825 కోట్లు అవుతుంది. అంతకు మించి ప్రజలపై భారం, ప్రభుత్వానికి వచ్చే నష్టం కలిపితే లక్షా 10వేల160 కోట్లుగా అంచనా. ఈ ప్రకారం విద్యుత్‌ కొనుగోలుకు పెట్టే ఖర్చు కంటే రాష్ట్రానికి వాటిల్లే నష్టమే ఎక్కువగా ఉంటుంది.

ఆడబిడ్డకో న్యాయం - అదానీకో న్యాయమా మోదీజీ ?: ఎమ్మెల్సీ కవిత

ABOUT THE AUTHOR

...view details