ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేట్, ప్రభుత్వ వైద్యులతో కొత్త జేఏసీ- ఆరోగ్య శ్రీ ప్యాకేజీ ధరల పెంపుకు డిమాండ్ - Aarogyasri pending billes

ఆరోగ్యశ్రీ బకాయిలు ఒప్పందం ప్రకారం చెల్లిస్తేనే నెట్వర్క్ ఆసుపత్రులు పనిచేసే పరిస్థితి ఉంటుందని ఏపీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ పేర్కొంది. ఇప్పటికే రూ. 600 కోట్ల ఆరోగ్య శ్రీ బిల్లుల బకాయిలు ఉన్నాయని తెలిపింది. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రైవేట్, ప్రభుత్వ వైద్యులతో కొత్త జేఏసీ ఏర్పాటుచేశారు.

Aarogyasri_Pending_Bills_in_AP
Aarogyasri_Pending_Bills_in_AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 9:59 PM IST

Updated : Feb 4, 2024, 10:36 PM IST

Aarogyasri Pending Bills in AP : జగన్ ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు సకాలంలో ఆరోగ్ర శ్రీ బిల్లులు చెల్లించక పోవడంతో అవి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కేవలం ఆరోగ్యశ్రీ వైద్య సేవలపైనే మనుగడ సాగించే కొన్ని ఆస్పత్రులకు ఈబిల్లులు భారంగా మారుతున్నాయి. ఆ ప్రభావం రోగులపై పడుతోంది. ఇలాంటి అన్ని సమస్యలపై ఏపీజీడీఏ, ఆప్నా, ఆషా, ఏపీ జూడా సంఘాలు సంయుక్తంగా విజయవాడలో సమావేశమై చర్చించాయి. చర్చలో భాగంగా ఏపీ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డా.రమేష్ మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ బకాయిలు ఒప్పందం ప్రకారం చెల్లిస్తేనే నెట్వర్క్ ఆసుపత్రులు పనిచేసే పరిస్థితి ఉంటుందని తెలిపారు.

ఆరోగ్యశ్రీపై ప్రచారం ఘనం - బిల్లుల చెల్లింపుల్లో నిర్లక్ష్యం

దాదాపుగా రూ. 600 కోట్ల మేర బకాయిలు ఇంకా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొసీజర్ల ప్యాకేజీలను ప్రభుత్వం ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 300 బెడ్లు కలిగిన ఆసుపత్రి ఎక్కడ లేదని తెలిపారు. ఇనిపై ప్రభుత్వం ఇప్పకైనా ఆలోచించలన్నారు. ఎన్​ఏబిహెచ్ అక్రీడేటెడ్ ఆసుపత్రులకు ప్రస్తుతం 2 శాతం ఇస్తున్న ఇన్సెంటివ్స్​ను 10 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రైవేట్, ప్రభుత్వ వైద్యుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ వైద్యులు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు.

Private Hospitals Facing Problems : ఏపీజీడీఏ, ఆప్నా ,ఆషా, ఏపీజూడా సంఘాలు సంయుక్తంగా విజయవాడలో సమావేశమై సమస్యలపై చర్చించాయి. సమావేశంలో భాగంగా విజయవాడ సిద్ధార్ధ మెడికల్ కళాశాల హాస్టల్ అధ్వాన స్థితికి చేరుకుందని ఏపీ జూడాల సంఘం అధ్యక్షుడు డా.చైతన్య తెలిపారు. కళాశాలలో 336 మంది పీజీ విద్యార్ధులు ఉంటే కేవలం 130 మంది విద్యార్థలకు మాత్రమే హాస్టల్ వసతి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే విద్యార్ధులందరికీ హాస్టల్ వసతి కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

ఆరోగ్యశ్రీ సేవలు బంద్! - రూ.1000 కోట్ల బకాయిలు, చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం

మధ్యలో నిలిచిపోయిన నూతన హాస్టల్ భవన నిర్మాణాన్ని కొనసాగించేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు బకాయిలు లేకుండా ప్రతీ నెలా స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు దశాబ్దాలుగా డాక్టర్లపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ఏఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జయచంద్ర నాయుడు కోరారు. చికిత్స పొందుతూ ఎవరైనా రోగి మృతిచెందితే సంబంధిత వైద్యునిపై చర్యలుతీసుకునేందుకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. బోర్డు ద్వారా విచారణ జరిపి వైద్యుని నిర్లక్ష్యం వల్లే రోగి మృతి చెందాడని తేలితే అతనిపై కేసు నమోదు చేసే విధంగా ప్రొసీజర్​ను తీసుకురావలన్నారు. నూతన ఆసుపత్రికి ఇచ్చే అనుమతుల నిబంధనలను సరళీకృతం చేయాలని డిమాండ్ చేశారు.

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని హెచ్చరిక- ఇకపై ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు ఉండవా?

'చికిత్స పొందుతూ రోగి మృతి చెందితే వైద్యునిపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి'
Last Updated : Feb 4, 2024, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details