ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఎక్స్​ప్రెస్​లో మహిళపై లైంగిక దాడి- పెనుగులాటలో కిందపడి తీవ్రగాయాలు - Visakha Express Sexually Assaults - VISAKHA EXPRESS SEXUALLY ASSAULTS

Visakha Express Sexually Assaults : విశాఖ ఎక్స్​ప్రెస్​లో మహిళపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఇద్దరి మధ్య పెనుగులాట జరగడంతో మహిళ, నిందితుడు రైలునుంచి కిందకు పడిపోయారు. వారిని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Visakha Express Sexually Assaults
Visakha Express Sexually Assaults (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 10:51 PM IST

Updated : Jul 9, 2024, 11:00 PM IST

A Young Man Sexually Assaulted Young Woman in the Visakha Express: విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మద్యం మత్తులో ఓ యువకుడు ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం రాత్రి 7గంటలకు మిర్యాలగూడ స్టేషన్‌కు చేరుకుంది. రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే రైలు వేగం తగ్గింది. అదే సమయంలో ఎస్‌-2 బోగీలో ప్రయాణిస్తున్న ఓ మహిళ వాష్‌రూమ్‌ నుంచి తన సీటు వద్దకు వెళ్తుండగా డోర్‌ వద్ద మద్యం మత్తులో ఉన్న ఒడిశాకు చెందిన బిశ్వాస్‌ ఆమె నడుము పట్టుకుని కిందకు లాగాడు. ఆమె ప్రతిఘటించడంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో ప్రయాణికురాలు రైలు నుంచి కింద పడిపోయింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత బిశ్వాస్‌ కూడా రైలు నుంచి కిందపడ్డాడు.

గాయపడిన బాధితురాలు సమీపంలోని తండా వద్దకు నడుచుకుంటూ వెళ్లి స్థానికులకు విషయం చెప్పింది. వారు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రైల్వే ఎస్‌ఐ పవన్‌ కుమార్‌రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. రైలు పట్టాలపై కొంత దూరంలో మద్యం మత్తులో పడి ఉన్న బిశ్వాస్‌ను మరో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన - వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌ - Former YCP Mla Sudhakar Arrest

Last Updated : Jul 9, 2024, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details